Sunday, 24 February 2019

సుకుమారుడా..సంపన్నుడా..శతకోటిసూర్యతేజుడా మనోహరుడా


సుకుమారుడా..సంపన్నుడా..
శతకోటిసూర్యతేజుడా మనోహరుడా
సుందరుడా నా ప్రాణప్రియుడా
                       సుకుమారుడా
కన్యకుమారుడా యేసయ్యా   }
కారణజన్ముడా..                } “2”
స్తుతిగీతమే పాడనా... “2”
శృతిమించి నిన్నేకీర్తించనా  “2”
                           శతకోటి
అక్షయుదీపమా     }
నా రక్షణ నివాసమా } “2”
పరదేశినై పాడనా...  “2”
పత్రికనై కొనియాడనా... “2”
                            శతకోటి
ప్రేమ పావురమా...   }
నా పుణ్యక్షేత్రమా...   } “2”
పరిమళమై పాడనా.... “2”
పరవసించినీలో నాట్యమాడనా “2”
                              శతకోటి
ఆరాధ్యదైవమా...  }
నా ఆనందతైలమా..} “2”
అంకితమై పాడనా...”2”
అభినయించి నిన్నే వర్ణించనా  “2”
                                శతకోటి
        దేవునికి మహిమ కలుగును గాక!
 *------------------------------------*
            రచన&స్వరకల్పన
          పాస్టర్ కే.రాజబాబు గారు
  సేకరణ:
         🎹🎼L.V.Paul:ఖమ్మం🎼🎹
         సెల్ నెంబర్:9948089237
         lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

Friday, 22 February 2019

నా చంద్రుడెన్నడు క్షీణించడు నా సూర్యుడెన్నడు అస్తమించడు


నా చంద్రుడెన్నడు క్షీణించడు      }
నా సూర్యుడెన్నడు అస్తమించడు } “2”
కరుణామయుడమ్మా కలువరి నాధుడమ్మా }
కారణజన్ముడమ్మా నా ప్రాణానాధుడమ్మా    } “2”
కన్నీరైనా కడగండ్లయినా    }
కటకమైనా ఖడ్గమే అయినా } “2”
కనికరము చూపుటకు కదలివచ్చు నా రాజు
సమాధానమిచ్చుటకు సాగివచ్చు నా యేసు
కరుణామయుడమ్మా కలువరి నాధుడమ్మా
కారణజన్ముడమ్మా నా ప్రాణాధుడమ్మా
                              నా చంద్రు
నా దేవుడే నా నిత్యమైన వెలుగు  }
తరతరములకు సంతోషమొలుకు  } “2”
నా భూషణమూ.. నా దర్శనమూ
నా ఒంటరితనము వేయిమందగును
ఉన్నత దుర్గమమ్మా నా పెన్నిధి యేసేనమ్మా
సన్నుతి చేయరమ్మా ఆ సన్నిధి చేరరమ్మా
                              నా చంద్రు
      దేవునికి మహిమ కలుగును గాక!
 *----------------------------------*
      రచన;స్వరకల్పన;గానం
     పాస్టర్ కే.రాజబాబు గారు
  సేకరణ:
       🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
     సెల్ నెంబర్:9948089237
     lvpaul9460.blogspot.com
       🙏*Praise The Lord*🙏

యేసురాజా నీకే వందనము ప్రాణనాధా నీకే వందనము


హల్లేలూయా.. హల్లేలూయా...
యేసురాజా నీకే వందనము }
ప్రాణనాధా నీకే వందనము  } “2”
కారు చీకటి కోరలలోన
ఊరుపేరు లేనినన్ను
తేరిపార చూశావా.. ఏరికోరి పిలిచావా
నీ ప్రేమే పూల బాట నీ సిలువే ధర్మకాట “2”
                          యేసురాజా
కన్నీటి మడుగులలోనా
అన్యాయపుటడుగులలోనా
నింగి చీల్చి వచ్చావా..నా రంగే మార్చి వేశావా
నీ మనసే పసిడి కోట నీ ఊసే ధర్మకాట
                               యేసురాజా
      దేవునికి మహిమ కలుగును గాక!
 *----------------------------------*
      రచన;స్వరకల్పన;గానం
     పాస్టర్ కే.రాజబాబు గారు
  సేకరణ:
       🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
     సెల్ నెంబర్:9948089237
     lvpaul9460.blogspot.com
       🙏*Praise The Lord*🙏