పెళ్ళి పాటలు
పాట 1
కురిసెను ఆనందాలు
జతకలిసెను అనుబంధాలై
ఇది దేవునికార్యం శుభతరుణం "2"
"కురిసెను"
సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను }
దేవుడే చేసేను జతపరచి దీవించెను } "2"
వివాహము అన్నిటిలో ఘనమైనబంధం }
నిలిచిపోవాలి ఎన్నటికి ఈ బంధం } "2"
"కురిసెను"
యేసే మీ గృహమును కట్టెను స్థిరముగా }
క్రీస్తే యజమానిగా పాలించును ప్రభువుగా } "2"
ఓకరికి ఓకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో }
ప్రేమా భక్తి కలిగి జీవించాలి } "2"
"కురిసెను"
పాట 2
పరిశుద్ద పరిశుద్ద పరిశుద్ద ప్రభువా
వరదూతలైనా నిన్ వర్ణింప గలరా
"పరి"
1.పరిశుద్ద జనకుండ పరమాత్మరూపుండా
నిరుపమ బలబుద్ది నీతి ప్రభావా
"పరి"
2.పరిశుద్ద తనయుండ నరరూప ధారుండ
నరులను రక్షించు కరుణా సముద్రా
"పరి"
3.పరిశుద్దమగు ఆత్మ వరములిడునాత్మ
పరమానంద ప్రేమా భక్తులకిడుమా
"పరి"
4.జనయ కుమారాత్మ లను నేక దేవా
ఘనమహిమ చెల్లును దనర నిత్యముగా
"పరి"
పాట 3
మంగళమే యేసునకు
మనుజావ తారునకు "2"
శృంగార ప్రభువునకు "2"
క్షేమాధిపతికి మంగళమే
"మంగళమే"
పరమపవిత్రునకు వరదివ్యతేజునకు "2"
నిరుపమ నందునకు నిపుణ వేద్యునకు మంగళమే
"మంగళమే"
దురిత సంహారునకు వరసుగుణోధారునకు "2"
కరుణాసంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే
"మంగళమే"
రాజులపై రాజునకు రవికోటితేజునకు "2"
బూజార్హపదాబ్దునకు భువనావన మీకు మంగళమే
"మంగళమే"
సత్యప్రవర్తునకు సద్దర్మశీలునకు "2"
నిత్యస్వయం జీవినకు నిర్మలాత్మునకు మంగళమే
"మంగళమే"
యుక్తస్తోత్రార్హునకు భక్త రక్షామణికి "2"
సత్య పరంజ్యోతియగు సార్వభౌమునకు మంగళమే
"మంగళమే"
పరమపురి వాసునకు నరదైవ రూపునకు "2"
పరమేశ్వర తనయునకు బ్రణుతింతుము నీకు మంగళమే
"మంగళమే"
పాట 4
దేవర నీ దీవెనలు ధారాళముగను వీరలపై
బాగుగ వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను
"దేవర"
దంపతులు దండిగనీ ధాత్రిలొ వెలయుఛు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుఛు సహింపున వీరు సుఖింఛుటకై
"దేవర"
ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లొకనములొ
శోకము లేకయే యేకముగా బ్రాకటముగాను జే కొనుము
"దేవర"
వాసిగ నీదాసులముఛెసిన యీ మొఱల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడౌ పేరిట బ్రోవు మామెన్
"దేవర"
పాట 5
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం "2"
"ఎక్కడెక్కడో"
ఒంటరిగా బ్రతుకులు విడిచెదరు
ఒకరికొరకు ఒకరు బ్రతికెదరు
పెళ్లినాటి నుండి తల్లితండ్రుల వదలి
భార్యాభర్తలు హత్తుకొనుటేమిటో
"ఇది"
గత కాల కీడంతా మరచెదరు
మేలులతో సంతసించెదరు
పెళ్ళినాటి నుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో
"ఇది"
ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించీ వృద్ది పొందెదరు
పెళ్ళినాటి నుండి మా కుటుంబం అంటూ
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో
"ఇది"
పాట 6
కల్యాణం కమనీయం }
ఈ సమయము అతిమధురం } "2"
దేవా రావయ్యా.. నీ దీవెనలీవయ్యా "2"
"కల్యాణం"
ఏదేను వనమున యెహోవ దేవా }
మొదటి వివాహము చేసితివే } "2"
ఈ శుభదినమున నవదంపతులను "2"
నీ దీవెనలతో నింపుమయా
"దేవా"
కానా విందులో అక్కరలెరిగి }
నీళ్ళను రసముగ మార్చితివే } "2"
కష్టములలో నీవే అండగనుండీ "2"
కొరతలుతీర్చి నడుపుమయా
"దేవా"
బుద్దియు జ్ఞానము సంపదలన్నియు }
గిప్తమైయున్నవి నీ యందే } "2"
ఇహపర సుఖములు మెండుగనొసగి "2"
ఇలవర్ధిల్లగ జేయుమయా
"దేవా"
పాట 7
కల్యాణమే కమనీయము }
కరుణామయుడేసుని ప్రియదానము } "2"
1.ఎలిసబెత్ గారు దేవుడు మీకు తోడు }
కుదిరింది నేడు షాలేము గారితో జోడు } "2"
నిలవాలి మీరు ప్రభురాక వరకు "2"
ప్రభు ప్రేమ నీడలో ఒకరికొకరుతోడుగా
"కల్యాణ"
నీ జీవిత నౌకకడచేరుదాక }
పయనించు గాక పెడదారిపోక } "2"
ఏలోటులేకఎడబాటు కాక "2"
నిలవాలి మీరు ప్రభు ప్రేమ నీడలో
"కల్యాణ"
దేవాధి దేవా దీవెనలిడరావా }
ఈ నూతన దంపతులను దీవించిపోవా } "2"
రాజాధిరాజ ఓ దివ్యతేజా "2"
అందుకొనుమా గైకొనుమా పూజ
"కల్యాణ"
పాట 8
ధన్యురాలు కావాలి నీ జీవితం }
బ్రతుకు ధన్యమేకలగాలి కలకాలం } "2"
జ్ఞానముతో ఆలోచించి ఇల్లు కట్టుకో }
ప్రేమతో కట్టిన పరువు నిలబెట్టుకో } "2"
ఓ చల్లని తల్లిగా లాలించి బిడ్డలను "2"
ఓ ఇంటి ఇల్లాలుగ జీవించు భర్తకు "2"
ధన్యురాలు ధన్యురాలు "2"
"ధన్యురాలు"
ఉత్తమమైన నీ ఆశలుచుగురించాలి }
సుబుద్దికలిగిన హృదయము నిండాలి } "2"
ఓ వనిత మారాలి నీ మనస్సు కవితా "2"
విరబూసే పుష్పములా ఉండాలి నీ ఎదా "2"
ధన్యురాలు ధన్యురాలు "2"
"ధన్యురాలు"
ఎగురుచున్న పావురమై ఎదగాలి నీవు }
పారే నది జలములా పొంగాలి జీవము } "2"
పలకాలి ప్రతిచోట ప్రభుయేసు రాగము "2"
పాడాలి ప్రతినోట పరిశుద్ద గానము "2"
ధన్యురాలు ధన్యురాలు "2"
"ధన్యురాలు"
పాట 9
వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది "2"
దేహములో సగభాగముగా }
మనుగడలో సహచారిణిగా } "2"
నారిగా సహకారిగా }
స్త్రీని నిర్మించినాడు దేవిడు } "2"
"వివాహ"
ఒంటరిగా ఉండరాదని }
జంటగా ఉండమేలని } "2"
శిరస్సుగా నిలవాలని }
పురుషుని నియమించినాడు దేవుడు } "2"
"వివాహ"
దేవునికి అతిప్రియులుగా }
ఫలములతో వృద్ది పొందగా } "2"
వేరుగానున్నవారిని }
ఒకటిగ ఇల చేసినాడు దేవుడు } "2"
"వివాహ"
పాట 10
కానా ఊరిలోన కల్యాణ విందులోన }
జరిగె వింత సంఘటన } "2"
అయిపోయే ద్రాక్షారసం మధ్యలోన "2"
యేసు పిలువబడుటవలన }
తొలగిపోయెను వేదన } "2"
"కాన"
యేసు ఆ చ్ఫ్టికి వచ్చినందున }
అవమానంకలగలేదు వేడుకలోనా } "2"
యేసయ్యలోన ప్రవేసించిన "2"
అక్కరలు తీరును సరియైన క్షణమున
"యేసు"
యేసు ఆ పెళ్ళిలో ఉండినందున }
నీటికి వచ్చే రంగు రుచి వాసన } "2"
యేసయ్య చేతికప్పగించిన "2"
మాధుర్యం చేరును నిస్సార బ్రతుకున
"యేసు"
యేసుతో సమస్య చెప్పినందున }
నీళ్ళుద్రాక్షారసమాయే ముంచినా } "2"
యేసయ్య మాట ఆలకించిన "2"
పరిస్థితి మారును సుళువై విధమున
"యేసు"
పాట 1
కురిసెను ఆనందాలు
జతకలిసెను అనుబంధాలై
ఇది దేవునికార్యం శుభతరుణం "2"
"కురిసెను"
సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను }
దేవుడే చేసేను జతపరచి దీవించెను } "2"
వివాహము అన్నిటిలో ఘనమైనబంధం }
నిలిచిపోవాలి ఎన్నటికి ఈ బంధం } "2"
"కురిసెను"
యేసే మీ గృహమును కట్టెను స్థిరముగా }
క్రీస్తే యజమానిగా పాలించును ప్రభువుగా } "2"
ఓకరికి ఓకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో }
ప్రేమా భక్తి కలిగి జీవించాలి } "2"
"కురిసెను"
పాట 2
పరిశుద్ద పరిశుద్ద పరిశుద్ద ప్రభువా
వరదూతలైనా నిన్ వర్ణింప గలరా
"పరి"
1.పరిశుద్ద జనకుండ పరమాత్మరూపుండా
నిరుపమ బలబుద్ది నీతి ప్రభావా
"పరి"
2.పరిశుద్ద తనయుండ నరరూప ధారుండ
నరులను రక్షించు కరుణా సముద్రా
"పరి"
3.పరిశుద్దమగు ఆత్మ వరములిడునాత్మ
పరమానంద ప్రేమా భక్తులకిడుమా
"పరి"
4.జనయ కుమారాత్మ లను నేక దేవా
ఘనమహిమ చెల్లును దనర నిత్యముగా
"పరి"
పాట 3
మంగళమే యేసునకు
మనుజావ తారునకు "2"
శృంగార ప్రభువునకు "2"
క్షేమాధిపతికి మంగళమే
"మంగళమే"
పరమపవిత్రునకు వరదివ్యతేజునకు "2"
నిరుపమ నందునకు నిపుణ వేద్యునకు మంగళమే
"మంగళమే"
దురిత సంహారునకు వరసుగుణోధారునకు "2"
కరుణాసంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే
"మంగళమే"
రాజులపై రాజునకు రవికోటితేజునకు "2"
బూజార్హపదాబ్దునకు భువనావన మీకు మంగళమే
"మంగళమే"
సత్యప్రవర్తునకు సద్దర్మశీలునకు "2"
నిత్యస్వయం జీవినకు నిర్మలాత్మునకు మంగళమే
"మంగళమే"
యుక్తస్తోత్రార్హునకు భక్త రక్షామణికి "2"
సత్య పరంజ్యోతియగు సార్వభౌమునకు మంగళమే
"మంగళమే"
పరమపురి వాసునకు నరదైవ రూపునకు "2"
పరమేశ్వర తనయునకు బ్రణుతింతుము నీకు మంగళమే
"మంగళమే"
పాట 4
దేవర నీ దీవెనలు ధారాళముగను వీరలపై
బాగుగ వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను
"దేవర"
దంపతులు దండిగనీ ధాత్రిలొ వెలయుఛు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుఛు సహింపున వీరు సుఖింఛుటకై
"దేవర"
ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లొకనములొ
శోకము లేకయే యేకముగా బ్రాకటముగాను జే కొనుము
"దేవర"
వాసిగ నీదాసులముఛెసిన యీ మొఱల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడౌ పేరిట బ్రోవు మామెన్
"దేవర"
పాట 5
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం "2"
"ఎక్కడెక్కడో"
ఒంటరిగా బ్రతుకులు విడిచెదరు
ఒకరికొరకు ఒకరు బ్రతికెదరు
పెళ్లినాటి నుండి తల్లితండ్రుల వదలి
భార్యాభర్తలు హత్తుకొనుటేమిటో
"ఇది"
గత కాల కీడంతా మరచెదరు
మేలులతో సంతసించెదరు
పెళ్ళినాటి నుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో
"ఇది"
ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించీ వృద్ది పొందెదరు
పెళ్ళినాటి నుండి మా కుటుంబం అంటూ
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో
"ఇది"
పాట 6
కల్యాణం కమనీయం }
ఈ సమయము అతిమధురం } "2"
దేవా రావయ్యా.. నీ దీవెనలీవయ్యా "2"
"కల్యాణం"
ఏదేను వనమున యెహోవ దేవా }
మొదటి వివాహము చేసితివే } "2"
ఈ శుభదినమున నవదంపతులను "2"
నీ దీవెనలతో నింపుమయా
"దేవా"
కానా విందులో అక్కరలెరిగి }
నీళ్ళను రసముగ మార్చితివే } "2"
కష్టములలో నీవే అండగనుండీ "2"
కొరతలుతీర్చి నడుపుమయా
"దేవా"
బుద్దియు జ్ఞానము సంపదలన్నియు }
గిప్తమైయున్నవి నీ యందే } "2"
ఇహపర సుఖములు మెండుగనొసగి "2"
ఇలవర్ధిల్లగ జేయుమయా
"దేవా"
పాట 7
కల్యాణమే కమనీయము }
కరుణామయుడేసుని ప్రియదానము } "2"
1.ఎలిసబెత్ గారు దేవుడు మీకు తోడు }
కుదిరింది నేడు షాలేము గారితో జోడు } "2"
నిలవాలి మీరు ప్రభురాక వరకు "2"
ప్రభు ప్రేమ నీడలో ఒకరికొకరుతోడుగా
"కల్యాణ"
నీ జీవిత నౌకకడచేరుదాక }
పయనించు గాక పెడదారిపోక } "2"
ఏలోటులేకఎడబాటు కాక "2"
నిలవాలి మీరు ప్రభు ప్రేమ నీడలో
"కల్యాణ"
దేవాధి దేవా దీవెనలిడరావా }
ఈ నూతన దంపతులను దీవించిపోవా } "2"
రాజాధిరాజ ఓ దివ్యతేజా "2"
అందుకొనుమా గైకొనుమా పూజ
"కల్యాణ"
పాట 8
ధన్యురాలు కావాలి నీ జీవితం }
బ్రతుకు ధన్యమేకలగాలి కలకాలం } "2"
జ్ఞానముతో ఆలోచించి ఇల్లు కట్టుకో }
ప్రేమతో కట్టిన పరువు నిలబెట్టుకో } "2"
ఓ చల్లని తల్లిగా లాలించి బిడ్డలను "2"
ఓ ఇంటి ఇల్లాలుగ జీవించు భర్తకు "2"
ధన్యురాలు ధన్యురాలు "2"
"ధన్యురాలు"
ఉత్తమమైన నీ ఆశలుచుగురించాలి }
సుబుద్దికలిగిన హృదయము నిండాలి } "2"
ఓ వనిత మారాలి నీ మనస్సు కవితా "2"
విరబూసే పుష్పములా ఉండాలి నీ ఎదా "2"
ధన్యురాలు ధన్యురాలు "2"
"ధన్యురాలు"
ఎగురుచున్న పావురమై ఎదగాలి నీవు }
పారే నది జలములా పొంగాలి జీవము } "2"
పలకాలి ప్రతిచోట ప్రభుయేసు రాగము "2"
పాడాలి ప్రతినోట పరిశుద్ద గానము "2"
ధన్యురాలు ధన్యురాలు "2"
"ధన్యురాలు"
పాట 9
వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది "2"
దేహములో సగభాగముగా }
మనుగడలో సహచారిణిగా } "2"
నారిగా సహకారిగా }
స్త్రీని నిర్మించినాడు దేవిడు } "2"
"వివాహ"
ఒంటరిగా ఉండరాదని }
జంటగా ఉండమేలని } "2"
శిరస్సుగా నిలవాలని }
పురుషుని నియమించినాడు దేవుడు } "2"
"వివాహ"
దేవునికి అతిప్రియులుగా }
ఫలములతో వృద్ది పొందగా } "2"
వేరుగానున్నవారిని }
ఒకటిగ ఇల చేసినాడు దేవుడు } "2"
"వివాహ"
పాట 10
కానా ఊరిలోన కల్యాణ విందులోన }
జరిగె వింత సంఘటన } "2"
అయిపోయే ద్రాక్షారసం మధ్యలోన "2"
యేసు పిలువబడుటవలన }
తొలగిపోయెను వేదన } "2"
"కాన"
యేసు ఆ చ్ఫ్టికి వచ్చినందున }
అవమానంకలగలేదు వేడుకలోనా } "2"
యేసయ్యలోన ప్రవేసించిన "2"
అక్కరలు తీరును సరియైన క్షణమున
"యేసు"
యేసు ఆ పెళ్ళిలో ఉండినందున }
నీటికి వచ్చే రంగు రుచి వాసన } "2"
యేసయ్య చేతికప్పగించిన "2"
మాధుర్యం చేరును నిస్సార బ్రతుకున
"యేసు"
యేసుతో సమస్య చెప్పినందున }
నీళ్ళుద్రాక్షారసమాయే ముంచినా } "2"
యేసయ్య మాట ఆలకించిన "2"
పరిస్థితి మారును సుళువై విధమున
"యేసు"
Excellent
ReplyDeleteGreat job..thank you.. God bless your ministry
ReplyDelete