*దావీదు హృదయం పగులని యెడల*
*పాటలు రాయగలడా.....*
*వీణను మరల మీటని యెడల*
*పాటలు పాడగలడా....* *"దావీదు"*
*శ్రమలలో సిరులను వెదకని యెడల* }
*ఆరాధించగలడా....* } "2"
*నాప్రాణమా...కృంగిపోకు* }
*ఓడిపోవని తెలుసుకో...* } "2"
*మోడుకావని తెలుసుకో...* }
*"దావీదు"*
చీకటినిండిన రాతిరికూడా }
వేకువ వెలుగును పొందునుగా... } "2"
సర్వము పోయిన యోబు కూడా }
రెండంతలుగా పొందెనుగా.... } "2"
*"నా ప్రాణమా"*
ఆకులు రాలిన మోడుకూడా }
చిగురులు తొడిగి ఫలియించునుగా... } "2"
మరలా కురులు పెరిగిన వెంటనే }
సంసోను బలమొందెనుగా... } "2"
*"నా ప్రాణమా"*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul.blogspot.com
🙏 *Prise TheLord* 🙏
No comments:
Post a Comment