అభిషేకించుమయ్యా యేసయ్యా
అభిషేకించుమయ్యా "2"
ఆత్మతో పరిశుధ్ధాత్మతో
అభిషేక తైలముతో "2" "అభి"
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యేసయ్యా "2"
"అభి"
కన్నీళ్ళతో నీచెంతచేరి ప్రార్ధించగనే "2"
నా కన్నీరంతా నాట్యమాయే
నా కలతలన్నీ తీరిపోయే "2"
"హల్లెలూయా"
రోగముతో ఆవేధనతో నీచెంత చేరగనే "2"
నా రోగము స్వస్ధతగమారే
ఆవేధన ఆనందమాయే "2"
"హల్లెలూయా"
నిందలను అవమానములన్
తొలగించమని కోరగా "2"
నా నిందలు పూదండలాయే
అవమానము అభినందనగమారే "2"
"హల్లెలూయా"
No comments:
Post a Comment