Tuesday, 27 January 2026

మానవుడా నీ జీవితం

 మానవుడా నీ జీవితం "2"

అందమైనది అపూర్వమైనది "2"

హల్లెలూయా... యేసయ్యా.... "2"

                              "మానవుడా"

గడ్డిలాంటిది నీ జీవితం         }

పువ్వులాంటిది నీ యవ్వనం } "2"

ఎపుడు సమసిపోవునో తెలియదు }

ఎక్కడ ఏమవునో నీవెరుగవు          } "2"

                              "మానవుడా"

పాడైనబ్రతుకు           }

చెడిపోయిన జీవితం } "2"

ఎవరుబాగుచేయుదురు ఎక్కడ బాగవునో "2"

ఆలోచించు నీవు పరిశీలించు "2"

                               "మానవుడా"

అశాశ్వతమైనది ఇలోకం  }

శాశ్వతమైనది పరలోకం   } "2"

సత్యమైన మార్గమును ఎన్నుకో...        }

నిత్యముండు రాజ్యమునకు చేరుకో... } "2"

                               "మానవుడా"


దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------*

రచన: స్వరకల్పన: ధరావత్ రత్నకుమార్ గారు

 సేకరణ: 🎹🎼L.V PAUL- KMM🎼🎹 

 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 

 🙏*Praise The Lord*🙏


Friday, 24 November 2023

ముఖ దర్శనం చాలయ్యా

 ముఖ దర్శనం చాలయ్యా

నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా "2"

సమీపించని తేజస్సులో

నివసించు నా దైవమా "2"

నీ ముఖ దర్శనం చాలయ్యా "2"

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా "2"


అన్న పానములు మరచి నీతో గడుపుట

పరలోక అనుభవమే

నాకది ఉన్నత భాగ్యమే "2"

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా "2"


పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది

మహిమలో చేరుటయే

అది నా హృదయ వాంఛయే "2"

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా "2"


కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి

గానము చేసెదను

ప్రభువా నిత్యము స్తుతియింతును "2"

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా "2"     "ముఖ"


Tuesday, 7 November 2023

ఏమిటో తెలియకున్నదయ్యా నీ ప్రేమకు కారణం

 ఏమిటో తెలియకున్నదయ్యా

నీ ప్రేమకు కారణం

అది ఏమిటో ఎరుగకున్నానయ్యా

నీ ప్రేమకు కారణం         "ఏమిటో"

ప్రేమించుచున్నావు...

క్షమియించుచున్నావు....

తండ్రికన్న మిన్నగా ఓదార్చుచున్నావు.....

                                          "ఏమిటో"

వ్యర్థుడవు అన్నారు బంధువులు

పనికిరావు అన్నారు స్నేహితులు

ఒంటరిని చేశారు ఆత్మీయులు

నిందలు మోపారు నా వారు

అయిననూ ఎందుకో...             }

ప్రేమించి పిలిచావు ప్రభువా....  } "2"

                                          "ఏమిటో"

యోసేపువలె నీతిమంతుడను కాను

మోషేవలె నమ్మకస్తుడను కాను

సంసోనువలే బలవంతుడను కాను

సోలోమోనువలె జ్ఞానవంతుడను కాను

అయిననూ ఎందుకో...             }

ప్రేమించి పిలిచావు ప్రభువా....  } "2"

                                          "ఏమిటో"

సృష్టించుకున్నావు నీ చేతులతో

వెలయిచ్చి కొన్నావు నీ రక్తంతో

నడిపించుచున్నావు నీ ఆత్మతో

రాబోవుచున్నావు నీ మహిమతో....

అందుకే ఈ పాపిని

ప్రేమించి పిలిచావు ప్రభువా... "2"


ఏమిటో తెలుసుకున్నానయ్యా

నీ ప్రేమకు కారణం

అది ఏమిటో ఎరిగియున్నానయ్యా

నీ ప్రేమకు కారణం

ఆరాధించెదనూ...

నినుకొనియాడి పాడేదనూ....

నా తుదిశ్వాస వరకు నీ కొరకు జీవింతును..... "2"

                                       "ఏమిటో"

Tuesday, 7 March 2023

ఉన్నాడు దేవుడు నాకు తోడు

 *ఉన్నాడు దేవుడు నాకు తోడు*

*విడనాడడెన్నడు ఎడబాయడు* (2)

*కష్టాలలోన నష్టాలలోన*

*వేదనలోన శోధనలోన*

                          *"ఉన్నాడు"*

గాఢాంధకారములో సంచరించినా

కన్నీటి లోయలో మునిగి తేలినా (2)

కరుణ లేని లోకము కాదన్ననూ (2)

కన్నీరు తుడుచును నను కొన్నవాడు

                               *"ఉన్నాడు"*

యెహోవ సన్నిధిలో నివసింతును

చిరకాలమాయనతో సంతసింతును (2)

కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును (2)

బ్రతుకు కాలమంతయు హర్షింతును

                                *"ఉన్నాడు"*

Monday, 6 March 2023

హేతువేమి లేకుండా స్వార్ధమేమి లేకుండా

 హేతువేమి లేకుండా

స్వార్థమేమి లేకుండా 

నన్ను ఎన్నుకున్న యేసయ్యా....

ఏముంది నాలో యేసయ్యా...

చెడియున్న బ్రతుకే నాదయ్యా "2" యేసయ్యా నీ ప్రేమా...

వర్ణింపా నా తరమా "2" 

                       "హేతువేమి"

కలిమి లేమి నీ వశము 

నీ కార్యములు ఇహపరము "2" 

నీవు నా ప్రాణము నీవు నా ధ్యానము. "2" ప్రేమకు రూపం నీ రూపము "2"

                            "యేసయ్యా" పాపములోనే తిరిగితిని 

నా పాపములు విడిచితిని "2" 

నన్ను దీవించినావు నన్ను పోషించినావు"2" 

జీవపు ఊటలు నాకొసగి నావు "2" 

                               "యేసయ్యా"


శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు

 శాశ్వతమైన ప్రేమతో

నన్ను ప్రేమించుచున్నావు
విడువక నాయెడ వత్సలమునే
చిపించుచున్నావు
అనుదినము... అనుక్షణము
కాపాడుచున్నావు...ఆ..ఆ...ఆ...
                              "శాశ్వతమైన"
ఎంతగా కృంగితినో...
అంతగ నను పైకి లేపితివి "2"
నీ దయతో.. నీ కృపలో...
సాగిపోయెదను    "2"
                          "శాశ్వతమైన"
ఎంతగా అలసితినో...
అంతగా నను బలపరచితివి "2"
నీ మార్గములో నీ సత్యములో
నేను నిలిచెదను     "2"
                          "శాశ్వతమైన"

           దేవునికి మహిమ కలుగును గాక!
 *---------------------------------*
                  రచన:స్వరకల్పన
          పాస్టర్.ప్రసాద్ జొన్నలగడ్డ గారు
                          కోదాడ
  సేకరణ:
                🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                   సెల్ నెంబర్:9948089237
                lvpaul9460.blogspot.com
                  🙏*Praise The Lord*🙏

యేసుబా తారో ప్రేమా కతరా మీటోబా....

 యేసుబా తారో ప్రేమా

కతరా మీటోబా....
లోయిన రేడన జానదినోజకో
ఊ తారో ప్రేమా   "2"

పరమేన తూ ఛోడన్
మారసారు ధరతిన ఆయో "2"
నాసవేగో జే మన్న
సత్తెన సీఖాయో  "2"  "పర"
యేసూ యేసూబా....             }
తూజమారో జీవ యేసుబా.... } "2"
                                     "యేసూబా"
పాపేన మకిదో...
సరాపేరో కాంటెరో కిరీటాపేరో  "2"
మారో భలాయి సారు
తారో జీవడామ ఘావవేగే "2"   "పాపేన"
యేసూ యేసూబా...                }
తూజ మారో దేవ యేసుబా....  } "2"
                                     "యేసూబా"
కడివేరొ మరాజీవణో...
మిటో వేన తూకిదో  "2"
అందారేరో కూయేతి    }
వజాళేమా లాయోచి   } "2"    "కడి"
యేసూ యేసూబా...                }
తూజ మారో వజాళో యేసుబా } "2"
                                     "యేసూబా"

       దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*

సేకరణ:
       🎹🎼L.V.Paul:ఖమ్మం🎼🎹
         సెల్ నెంబర్:9948089237
       lvpaul9460.blogspot.com
          🙏*Praise The Lord*🙏

నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా

 నీతో గడిపే ప్రతి క్షణము

ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)

కృప తలంచగా మేళ్లు యోచించగా (2)

నా గళమాగదు స్తుతించక – నిను కీర్తించక

యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (4)

                                              "నీతో"

మారా వంటి నా జీవితాన్ని

మధురముగా మార్చి ఘనపరచినావు "2"

నా ప్రేమ చేత కాదు

నీవే నను ప్రేమించి "2"

రక్తాన్ని చిందించి

నన్ను రక్షించావు "2"

                 "యేసయ్యా"

గమ్యమే లేని ఓ బాటసారిని

నీతో ఉన్నాను భయము లేదన్నావు "2"

నా శక్తి చేత కాదు

నీ ఆత్మ ద్వారానే "2"

వాగ్ధానము నెరవేర్చి

వారసుని చేసావు "2"

                 "యేసయ్యా"


తేనె కంటే తీయ్యనైనది

 తేనె కంటే తీయ్యనైనది 

నీప్రేమ నాదైవమా
తల్లి కన్న ప్రేమించినది
నీప్రేమ ప్రాణప్రియుడా   “తెనె”
ఎత్తయిననూ పల్లమయిననూ 
నీప్రేమ నుండీ యెడబాపలేవు “2”
కరువయిననూ ఖడ్గమయిననూ 
నీప్రేమ నుండీ విడదీయలేరు “2”  
                                     “తేనె"
డంబములేదు స్వార్ధములేదు
స్వప్రయోజనం కోరనలేదు “2”
విశ్వాసము కన్నా నిరీక్షణ కన్నా 
నీ ప్రేమ ఎంతో శ్రేష్టమైనది “2”
నీ ప్రేమా ........యేసయ్యా “4”   
                                     “తేనె”
ఆత్మీయులైనా స్నేహితులైనా 
బంధువులైనా ఇంకెవరైననూ “2”
మరణించలేదు ఆ సిలువలో 
చూపించలేదు నీప్రేమను “2”
యేసయ్యా.......... యేసయ్యా....... “4”  
                                    “తేనె”

          దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
         🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం

 జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం

నా జీవన మలి సంధ్య నీతోనే అంతము"2"

నా జీవన యాత్రకు 

మలి సంధ్య ఆసన్నమౌతుంది "2"

నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు "2"

                             "జీవన"

నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు

నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు 2

నిరీక్షణ లేని ఇతరుల పోలి 

దుఃఖించను నేను

నా భారము నీపై మోపి 

ముందుకు సాగుచున్నాను "2"

దేవా నీవే నా ఆశ్రయ దుర్గము "2"

                                     "జీవన"

నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు

ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను 2

నా శేష జీవితమంతయు 

నీకే అర్పించితినయ్యా

నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా "2"

దేవా నను నీ సాక్షిగ నిల్పుమా "2"

                                           "జీవన"


అభిషేకించుమయ్యా యేసయ్యా

 అభిషేకించుమయ్యా యేసయ్యా

అభిషేకించుమయ్యా    "2"

ఆత్మతో పరిశుధ్ధాత్మతో 

అభిషేక తైలముతో  "2"    "అభి"

హల్లెలూయా హల్లెలూయా 

హల్లెలూయా యేసయ్యా "2"

                             "అభి"

కన్నీళ్ళతో నీచెంతచేరి ప్రార్ధించగనే "2"

నా కన్నీరంతా నాట్యమాయే

నా కలతలన్నీ తీరిపోయే  "2"

                         "హల్లెలూయా"

రోగముతో ఆవేధనతో నీచెంత చేరగనే "2"

నా రోగము స్వస్ధతగమారే 

ఆవేధన ఆనందమాయే "2"

                         "హల్లెలూయా"

నిందలను అవమానములన్ 

తొలగించమని కోరగా "2"

నా నిందలు పూదండలాయే

అవమానము అభినందనగమారే "2"

                       "హల్లెలూయా"

నాకుముందు నీవు నడచినా...

 *నాకుముందు నీవు నడచినా...*

*చాలునయా...చాలునయా....*
*నీవుంటే నాకు చాలునయా...*  "2"
*యేసయ్యా.. ఆ..ఆ...యేసయ్యా.. ఆ..ఆ...*
*యేసయ్యా......*
                                 *"చాలునయా"*
ఎర్ర సముద్రం నా ముందు ఉండినా  }
పెను తుఫానులే నాపై పుట్టిన          } "2"
నను నడిపించు యేసు నీవుండగా..ఆ...ఆ..."2"
                                 *"చాలునయా"*
కరువు ఖడ్గము నా ఇంట నుండినా  }
వ్యాధి బాధలు నను చుట్టుముట్టినా } "2"
నను ప్రేమించు యేసు నీవుండగా..ఆ..ఆ..."2"
                                 *"చాలునయా"*
బంధుమిత్రులు నను విడిచినా   }
ధనధాన్యములే లేకుండినా       } "2"
నా స్నేహితుడా యేసు నీవుండగా..ఆ..ఆ..."2"
                                 *"చాలునయా"*

             🎹రచన&గానం🎹
        *సిస్టర్ బి.ఎస్తేర్ రాణి గారు*

      దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
      🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
         సెల్ నెంబర్:9948089237
       lvpaul9460.blogspot.com
          🙏*Praise The Lord*🙏

దావీదు హృదయం పగులని యెడల

 *దావీదు హృదయం పగులని యెడల*

*పాటలు రాయగలడా.....*

*వీణను మరల మీటని యెడల*
*పాటలు పాడగలడా....*        *"దావీదు"*
*శ్రమలలో సిరులను వెదకని యెడల*  }
*ఆరాధించగలడా....*                      } "2"
*నాప్రాణమా...కృంగిపోకు*  }
*ఓడిపోవని తెలుసుకో...*     }  "2"
*మోడుకావని తెలుసుకో...*  }
                                          *"దావీదు"*
చీకటినిండిన రాతిరికూడా            }
వేకువ వెలుగును పొందునుగా...    } "2"
సర్వము పోయిన యోబు కూడా   }
రెండంతలుగా పొందెనుగా....       } "2"
                                      *"నా ప్రాణమా"*
ఆకులు రాలిన మోడుకూడా              }
చిగురులు తొడిగి ఫలియించునుగా... } "2"
మరలా కురులు పెరిగిన వెంటనే     }
సంసోను బలమొందెనుగా...         } "2"
                                     *"నా ప్రాణమా"*

        దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
      🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
         సెల్ నెంబర్:9948089237
          lvpaul.blogspot.com
         🙏 *Prise TheLord* 🙏

కొండా కోన లోయల్లోతుల్లో… ఓ ఓ

 *కొండా కోన లోయల్లోతుల్లో… ఓ ఓ*

*వినబడుతుంది నా యేసుని స్వరమే*
*తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం*
*ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం*
                              *"కొండా కోన"*
నీ హృదయమనే ద్వారమున 
నిలుచున్నాడు నా యేసు
హృదయమందు చేర్చుకో నేస్తమా "2"
ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య
నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య
నీవు ఈ దినమందే యేసుని స్వరము 
వినుమన్నా "2"  
                                    *"కొండా కోన"*
ఆకాశానికి భూమికి మధ్య 
సిలువలో వేలాడెను నా యేసు
నిన్ను రక్షించాలని " 2"
కలువరి సిలువలో తన రక్తమును 
కార్చెను యేసయ్య
తన రాజ్యములో నిను చేర్చుటకు 
పిలిచెను యేసయ్య
నీవు ఈ దినమందే యేసుని స్వరము 
వినుమన్నా  "2"  
                               *"కొండా కోన"*

      దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
      🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
         సెల్ నెంబర్:9948089237
       lvpaul9460.blogspot.com
          🙏*Praise The Lord*🙏

ఏసో... ఎంత వరాలమనసో....నీది

 

*ఏసో... ఎంత వరాలమనసో....నీది*
*సిత్రా సిత్రాలుగా విన్నానయ్యా ఉసూ*
*ప్రభువా హైలెస్సో...*}
*పలికే ని దాసో.....*  } "2"
                                   *"ఏసో"*
గాలి వానొచ్ఛే నడి ఏటిలోన
నావ అల్లాడగా నీవే కాపాడినావే
కంటాజూడంగ గాలాగిపోయే
ఆలలే చల్లారేనే..
మహిమ చూపించి నావే "గాలి"
నిన్ను పొగడంగ నేనెంతటి వాడాన్ }
నీటి మడుగుల్లో చేపంటి వాడన్     } "2"
ఉప్పొంగే నీ ప్రేమలో...
ప్రభువా హైలెస్సో.....  }
పలికే నీ దాసో......     } "2"
                                *"ఏసో"*
దిక్కులేనట్టి దీనాత్ములనంటే
నీలో కలిగే దయా... నేడే తెలిసిందయా
జంతు బాలులిచ్చే మూడాత్ములంటే
నీలో రగిలి సొదా కరుణే వెదజల్లగా "దిక్కు"
నీవే రేవంట ఏ నావ కైనా....    }
నీవే కడలంట ఏ వాగు కైనా... } "2"
నా దారి గోదారిలో....
ప్రభువా హైలెస్సో.....  }
పలికే నీ దాసో......     } "2"
                                    *"ఏసో"*

    దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
      🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
         సెల్ నెంబర్:9948089237
      lvpaul9460.blogspot.com
          🙏*Praise The Lord*🙏

Monday, 8 March 2021

సంతోషించెద నీతోనే.... ఆనందించెద నీలోనే....

సంతోషించెద నీతోనే....
ఆనందించెద నీలోనే.... "2"
నా ఆశ్రయదుర్గము నీవనీ...
నా రక్షణశృంగము నీవనీ.... "2"
స్తుతులు చెల్లించుచుచూ...
స్తోత్రములే అర్పించుచూ... "2"
ఆరాధించెద అను క్షణం
నీ ఘననామమునే... "2"
                                     "సంతో"
1. కునుకక నిద్రించకా...
కనుపాపలా కాపాడినావు
ఏ తెగులు రాకుండా....
నీ బాహువులలో... దాచినావు "2"
నా మంచి సమరయుడా....
నా మంచి... దేవుడా...."2"
                                       "ఆరాధిం"
2. నేను నిన్ను ప్రేమించగా...
నన్ను నీవు తప్పించితివి...
నేను నీకు మొరపెట్టగా....
నాకు ఉత్తరమిచ్చితివి... "2"
శ్రమలో నాకు తోడైయుండీ
నను గొప్పచేసితివీ...
దీర్ఘాయువూ... నాకిచ్చి
నీ రక్షణను చూపితివీ "2"
                                     "ఆరా"
3. వేటకాని ఉరి నుండీ...
నను విడిపించితివీ...
ఏ తెగులు రాకుండా...
నను రక్షించితివీ... "2"
నీ రెక్కల నీడలో....
నాకు ఆశ్రయమిచ్చితివీ "2"
                                   "ఆరా"


           దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------*
                      పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
                         కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
  సేకరణ:
                   🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                      సెల్ నెంబర్:9948089237
                    lvpaul9460.blogspot.com
                     🙏*Praise The Lord*🙏

నాతోకూడా వచ్చువాడవూ...నీవే మంచి యేసయ్యా

నాతోకూడా వచ్చువాడవూ...నీవే మంచి యేసయ్యా
నాకు ముందర నడచువాడవూ... నీవే గొప్ప యేసయ్యా "2"
పగలు నీవు... మేఘస్థంభమై...
రాత్రి నీవు అగ్నిస్థంభమై
నిత్యము నాతో ఉండువాడవూ... "2"
                                                          "నాతో"
1. ఏ కీడు నాదరి చేరనీయవూ....
ఏ అపాయము రానీయవూ  "2"
కునుకని నిద్రపోని మంచికాపరీ...
నా చుట్టు నిత్యముండే గొప్పకాపరీ "2"
                                                      "పగలు"
2.ఏ పాపము నాకూ అంటనీయవూ...
ఏ శాపము నాకూ... రానీయవూ... "2"
నీ రక్త కోటలో నన్ను దాచీ
నిత్యజీవమిచ్చే మంచి కాపరీ "2"
                                                    "పగలు"
3. ఏ నష్టం నాకూ రానీయవూ...
ఏ కష్టము నాకూ కలుగనీయవూ... "2"
నిత్యము నాకై కృప చూపించీ...
ఆశీర్వదించే నిత్య కాపరీ... "2"
                                                 "పగలు"


           దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------*
                      పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
                         కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
  సేకరణ:      

                    🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                       సెల్ నెంబర్:9948089237
                     lvpaul9460.blogspot.com
                      🙏*Praise The Lord*🙏

కృపచూపుటకు.. నీవంటివారు... ఎవరున్నారయ్యా

కృపచూపుటకు.. నీవంటివారు... ఎవరున్నారయ్యా
ఈ ధరణిలో ఎవరులేరయ్యా...
దయగలవాడవూ... యేసయ్యా
కృపగలవాడవు...
నీవే యేసయ్యా... నీతోనే జీవితము "2"
                                                          "కృప"
1. మానవాళి రక్షణకై తండ్రిని విడిచి
భువికేతెంచిన తేజోమయుడా
తండ్రి కుడి పార్శముపై కూర్చుండు నీవే "2"
పశువుల పాకలో జనియించినావు "2"
                                                       "దయ"
2. మానవాళి క్షేమముకై మహిమను విడిచి
మనుష్యుల మధ్యలో నివసించినావు
నిత్యము దూతలతో పొగడబడునీవే "2"
పాపులతో నిందించబడినావు "2"
                                                    "దయ"
3. మానవాళి విడుదలకై ప్రాణము విడిచి
దోషుల చేతికి అప్పగించుకున్నావు
సింహసనముపై కూర్చుండు నీవే "2"
సిలువకు నిన్ను నీవే అప్పగించుకున్నావు "2"
                                                   "దయ"


           దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------*
                      పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
                         కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
  సేకరణ:
                   🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                      సెల్ నెంబర్:9948089237
                   lvpaul9460.blogspot.com
                    🙏*Praise The Lord*🙏

నా కన్నుల్లో నీవే నా గుండెల్లో నీవే

నా కన్నుల్లో నీవే
నా గుండెల్లో నీవే
నా మనసంతా నీవే
మా మది నిండా నీవే
నా అణువణువు నీవే యేసయ్యా
నాలో ఉన్న ఊపిరి నీవయ్యా
యేసయ్యా నీవే ఆధారము
యేసయ్యా నీవే నా ప్రాణము "2"
                                   "నా కన్నుల్లో"
1. నా శిల్పకారుడవు నా రూపకర్తవూ
నా జీవనదాతవూ నీవే యేసయ్యా
నీ రూపములో నన్ను చెక్కావు
నన్ను చూసి మురిసిపోయావు "2"
యేసయ్యా నీవె ఆధారము
యేసయ్యా నీవే నా ప్రాణము "2"
                                       "నా కన్ను"
2. నా మంచి పోషకుడా నా మంచి దేవుడా
సమకూర్చువాడవు నీవే యేసయ్యా
నాకేమికావలెనో ఎరిగినవాడవు
శ్రేష్టమైన ఈవులను ఇచ్చుచున్నావు
యేసయ్యా నీవే ఆధారము
యేసయ్యా నీవే నా ప్రాణము "2"
                                     "నా కన్ను"
3. నా మంచి నాయకుడా నడిపించే దేవుడా
నాకున్న సహాయము నీవే యేసయ్యా
శ్రేష్టమైన వరములను ఇచ్చియున్నావు
నీ శక్తితో నింపి నడుపుచున్నావు
యేసయ్యా నీవే  ఆధారము
యేసయ్యా నీవే నా ప్రాణము "2"
                                    "నా కన్ను"


           దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------*
                      పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
                         కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
  సేకరణ:
                   🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                      సెల్ నెంబర్:9948089237
                    lvpaul9460.blogspot.com
                     🙏*Praise The Lord*🙏

దహించు అగ్నివై నా తోనే నీవుంటే

 దహించు అగ్నివై నా తోనే నీవుంటే
నే దాటి పోదును సరిహద్దులెన్నెన్నో
రోషముగల దేవుడనీవయ్యా
ఏ శత్రువు నీ ఎదుట నిలువలేడయ్యా
నిత్యము మండుచూ ప్రకాశించే
అగ్నిగోళము నీవే యేసయ్యా... "2"
                                        "దహించు"
1. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పెదా
కాడిమ్రాను మేకులు తీసెదా "2"
ఎర్రసంద్రము దాటెదనయ్యా
ఎరికోగోడలు కూల్చెదనయ్యా
                                       "రోషము"
2. బంధింపబడినవారిని విడిపించెదనూ
అపవాది కాడిని విరుగగొట్టెదా "2"
అగ్ని గుండము నుండీ బయటకు వచ్చెదా
సింహాల బోనులో సజీవునిగా ఉండెదా
                                                "రోషము"
3. పాడైపోయిన పునాదులు కట్టెదా
విరిగినదానిని బాగుచేసెదా
దేశంలో ప్రజలంతా క్షేమంగా ఉండునట్లు
నీ త్రోవలన్నీ సిద్దపరచెదా
                                               "రోషము"


           దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------*
                      పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
                         కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
  సేకరణ:
                    🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                       సెల్ నెంబర్:9948089237
                     lvpaul9460.blogspot.com
                      🙏*Praise The Lord*🙏