Wednesday, 3 June 2020

ఈ దినము నా యెడల వాత్సల్యత చూపుచూ

ఈ దినము నా యెడల వాత్సల్యత చూపుచూ  }
అనుక్షణము నా కొరకే నీవు వేచియుంటివా       } "2"
నా యెదవాకిట నిలచి                }
నను పిలిచిన ప్రియ యేసయ్యా } "2"
స్తోత్రం దేవ స్తోత్రం "4"
                                                 "ఈ దినము"
అరుణోదయమున కురిసే మంచువలె }
నీ ప్రేమా నా హృదిలోన కురిసెనే.......  } "2"
విరబూయనా.. పరిమళీంచనా  "2"
నీ ప్రేమలో నిలిచి ఫలియించనా  "2"
                                               "స్తోత్రం"
చెడిన వాడనని (దాననని) త్రోసివేయకా }
చేతులతో నన్ను పట్టుకుంటివే...........   } "2"
నీ వాక్యముతో నన్ను సరిచేయుటకు  "2"
ప్రభువా నీ యెదుట నను పిలిచితివా "2"
                                               "స్తోత్రం"
దుప్పి వలెనే గంతులు వేయనా      }
ప్రభువా నీ సన్నిధి ప్రహర్షించనా...  } "2"
జీవజలములు నాకిచ్చినందునా  "2"
ప్రియుడా నీ కొరకే జీవించెదను  "2"
                                               "స్తోత్రం"



           దేవునికి మహిమ కలుగును గాక!
 *---------------------------------*

                             రచన&స్వరకల్పన
                        బ్రదర్ ఆదాంబెన్ని గారు
                           నర్సంపేట,వరంగల్
    సేకరణ:
                 🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                    సెల్ నెంబర్:9948089237
                 lvpaul9460.blogspot.com
                  🙏*Praise The Lord*🙏

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంతకాలం

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంతకాలం   }
కష్టాలబాటలోన సాగదు పయనం          } "2"
విడుదల సమీపించును        }
నీకు వెలుగు ఉదయించును } "2"

నీవు మోసిన నిందకు ప్రతిగా
పూదండ ప్రభువు ఇచ్చునులే
నీవు పొందిన వేదనలన్ని
త్వరలో తీరిపోవునులే   "నీవు"
నీ స్థితిచూసి నవ్వినవారే   }
సిగ్గుపడే దినమొచ్చేనులే } "2"
                                    "విడుదల"
అనుభవించిన లేమి బాధలు
ఇకపై నీకు ఉండవులే
అక్కరలోను ఉన్నవారికి
నీవే మేలు చేసేవులే  "అనుభ"
మొదట నీ స్థితి కొంచమే ఉన్న }
తుదకు వృద్దిని పొందునులే     } "2"
                                    "విడుదల"

           దేవునికి మహిమ కలుగును గాక!
 *---------------------------------*

                             రచన&స్వరకల్పన
                         పాస్టర్ షాలేంరాజు గారు
                         తండ్రిసన్నిధి మినిస్ట్రీస్
    సేకరణ:
                  🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                     సెల్ నెంబర్:9948089237
                   lvpaul9460.blogspot.com
                    🙏*Praise The Lord*🙏

నీవేనా ప్రాణం సర్వం నీవేనా ధ్యానం గానం

నీవేనా ప్రాణం సర్వం
నీవేనా ధ్యానం గానం
యేసయ్యా నీవే ఆధారం  "2"
నీవేగా.. నా ప్రాణం....
యేసయ్యా... నీవే జీవితం
యేసయ్యా.. యేసయ్యా యేసయ్యా యేసయ్యా   }
హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ హల్లేలూయా } "2"
                                                      "నీవేనా"
నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది  }
నీ రాకకే కదా నేనెదురు చూచునది } "2"
నీ వలే ఉందును నీలో వశించెదను "2"
అండ దండ కొండా నీవయ్యా..ఓ..ఓ..
నాకున్న లోకం అంతా నీవయ్యా
అండ దండ కొండా నీవయ్యా..ఓ..ఓ..
నీకన్నా వేరే ఎవరు లేరయ్యా....
                                           "నీవేగా"
నా కాపరి నీవే నా ఊపిరి నీవే     }
నా దారివి నీవే నా మాదిరి నీవే  } "2"
నీవలే ఉందును నీ వెంటసాగెదను
                                          "అండ"


           దేవునికి మహిమ కలుగును గాక!
 *--------------------------------*

     సేకరణ:
                     🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                        సెల్ నెంబర్:9948089237
                      lvpaul9460.blogspot.com
                       🙏*Praise The Lord*🙏

దూరమైతివా నా కన్నబిడ్డా..

f: దూరమైతివా నా కన్నబిడ్డా..   }
        దూరమైతివా నా కన్నబిడ్డా...  } "2"
కన్నతండ్రినొదిలి స్వంత ఇల్లు విడిచి  "2"
ఎచటతిరుగుచుంటివి ముద్దుబిడ్డా మురిపాల బిడ్డా "2"
                                                       "దూరమైతివా"
s: దూరమైతిని నా కన్న తండ్రి             }
        ఘోరమయ్యెను నా బ్రతుకు తండ్రి  } "2"
లోకమాయ నమ్మి నీకు దూరమయ్యి "2"
వేదనతో తిరుగుచుంటి కన్నతండ్రి నా కన్నతండ్రి "2"
                                                       "దూరమైతిని"
f: కానివారి స్నేహానికి కావాలని వెళ్ళావు "2"
        క్షేమముగా ఉన్నావా కన్నబిడ్డా
నా కడుపుతీపినెరుగవా కన్నబిడ్డా
నా కడుపుతీపినెరుగవా కన్నబిడ్డా
                                                  "దూరమైతివా"
s: నమ్ముకున్న స్నేహాలు నయవంచన చేసాయి "2"
        దిక్కులేనివాడనైతి కన్నతండ్రి
నేబిక్కు బిక్కుమంటు ఉంటి కన్నతండ్రి
ఏదిక్కులేకతిరుగుచుంటి కన్నతండ్రీ...
                                                   "దూరమైతిని"
f: కొంచము ఆలస్యమైన ఉండలేవు ఆకలికి "2"
       అన్నమైన తిన్నావా కన్నబిడ్డా
నువు ఆకలితో ఉన్నావా కన్నబిడ్డా
నువు ఆకలితో ఉన్నావా కన్నబిడ్డా
                                                "దూరమైతివా"
s: ఆకలితో అలమటించి పస్తులతో బ్రతుకుచుంటి "2"
        పందులు తిను పొట్టుకై కన్నతండ్రి
నే పనివానిగ మారితిని కన్నతండ్రి
అది కూడా కరువయ్యే కన్నతండ్రి
                                                 "దూరమైతిని"
f: కనుదూరమైన నిన్ను కలవరించే నా హృదయం "2"
        పరితపించుచుంటిని ముద్దుబిడ్డా
నీకొరకే చూచుచుంటి చిన్నబిడ్డా
నీకొరకే వేచియుంటి ముద్దిబిడ్డా
                                                "దూరమైతివా"
s: నీవు తప్ప నాకు దిక్కు ఎవరు లేరు  "2"
        తప్పునాకు తెలిసింది కన్నతండ్రి
నా తప్పు దిద్దుకుంటాను కన్నతండ్రి
నీ పనివానిగ ఉంటాను కన్నతండ్రీ...

s: దూరమైతిని నా కన్న తండ్రి
        ఘోరమయ్యెను నా బ్రతుకు తండ్రి

                              మహిమ కలుగును గాక!
 *-----------------------------------*
                           రచన:స్వరకల్పన
                      బ్రదర్ షాలేంరాజు గారు
                      తండ్రి సన్నిధి మినిస్టీస్
  సేకరణ:
                 🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                    సెల్ నెంబర్:9948089237
                  lvpaul9460.blogspot.com
                   🙏*Praise The Lord*🙏

కృంగిపోకుమా నేస్తమా...యేసు నీ తోడు ఊండగా..

కృంగిపోకుమా నేస్తమా...    }
యేసు నీ తోడు ఊండగా..  } "2"
విడువను యెడబాయనని  "2"
వాగ్దానమిచ్చిన ప్రభుని చూడవా  "2"
                                         "కృంగి"
శ్రమలైనా నిందలైనా                   }
ఆకలిదప్పులైన కొరడా దెబ్బలైన  } "2"
సహియించి.. ఓర్చుకుని  "2"
ముందున్న బహుమానముకై పరుగెత్తిన  "2"
బ్రతుకుట క్రీస్తే చావైన మేలనిన  "2"
పౌలును చూడవా...
కృంగిపోకుమా నేస్తమా...
యేసు నీ తోడు ఉండగా
పడిపోకుమా నేస్తమా...
పరిశుద్దుడు తోడు ఊండగా

దేవుని చేతిలో గొప్ప సాధనమై      }
విశ్వాసముతో నడచిన సేవకుడు  } "2"
ఒక్కడే అయినా  ధైర్యముగా నిలిచి  "2"
పరలోక అగ్నిని భివిపైకి దింపిన  "2"
బలహీనుడైనను బలముగా నిలిచిన  "2"
ఏలియాను చూడవా
కృంగిపోకుమా నేస్తమా...
యేసు నీ తోడు ఉండగా
భయపడకుమా నేస్తమా..
సృష్టికర్త చెంతనుండగా

ఎవరున్నా.. ఏమిలేకున్నా         }
ఒంటరినైనానని కృంగిపోకుమా  } "2"
నిను పిలిచి... ఏర్పరచి  "2"
నీచేయి పట్టి నిన్ను నడుపును యేసయ్యా "2"
సర్వోన్నతదేవుడే నీ తోడుండగ "2"
భయపడుచు ఉందువా
కృంగిపోకుమా నేస్తమా...
యేసు నీ తోడు ఉండగా
కలత చెందకు నేస్తమా
మహోన్నతుడు తోడు ఉండగా

బలవంతుని చేతిలో బాణమే నీవు  }
బలహీనుడవు కావు పరాక్రమశాలివి } "2"
దిగులేలా.. భయమేలా...  "2"
శూరుని చేతిలో ఆయుధములాగ  "2"
దేవుడేనిన్ను ప్రయోగించునన్న  "2"
ఈ మాట నమ్మవా..
కృంగిపోకుమా నేస్తమా...
యేసు నీ తోడు ఉండగా
ఒంటరివికకావు నేస్తమా..
ప్రభువే నీ చేంతనుండగా
పేరుతో నిను పిలిచినా "2"
మహోన్నత దేవుని కృపను చూడవా "2"
                                              "కృంగి"

                     దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------*
                         రచన:స్వరకల్పన
               🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                  సెల్ నెంబర్:9948089237
                lvpaul9460.blogspot.com
                 🙏*Praise The Lord*🙏