Wednesday, 3 June 2020

కృంగిపోకుమా నేస్తమా...యేసు నీ తోడు ఊండగా..

కృంగిపోకుమా నేస్తమా...    }
యేసు నీ తోడు ఊండగా..  } "2"
విడువను యెడబాయనని  "2"
వాగ్దానమిచ్చిన ప్రభుని చూడవా  "2"
                                         "కృంగి"
శ్రమలైనా నిందలైనా                   }
ఆకలిదప్పులైన కొరడా దెబ్బలైన  } "2"
సహియించి.. ఓర్చుకుని  "2"
ముందున్న బహుమానముకై పరుగెత్తిన  "2"
బ్రతుకుట క్రీస్తే చావైన మేలనిన  "2"
పౌలును చూడవా...
కృంగిపోకుమా నేస్తమా...
యేసు నీ తోడు ఉండగా
పడిపోకుమా నేస్తమా...
పరిశుద్దుడు తోడు ఊండగా

దేవుని చేతిలో గొప్ప సాధనమై      }
విశ్వాసముతో నడచిన సేవకుడు  } "2"
ఒక్కడే అయినా  ధైర్యముగా నిలిచి  "2"
పరలోక అగ్నిని భివిపైకి దింపిన  "2"
బలహీనుడైనను బలముగా నిలిచిన  "2"
ఏలియాను చూడవా
కృంగిపోకుమా నేస్తమా...
యేసు నీ తోడు ఉండగా
భయపడకుమా నేస్తమా..
సృష్టికర్త చెంతనుండగా

ఎవరున్నా.. ఏమిలేకున్నా         }
ఒంటరినైనానని కృంగిపోకుమా  } "2"
నిను పిలిచి... ఏర్పరచి  "2"
నీచేయి పట్టి నిన్ను నడుపును యేసయ్యా "2"
సర్వోన్నతదేవుడే నీ తోడుండగ "2"
భయపడుచు ఉందువా
కృంగిపోకుమా నేస్తమా...
యేసు నీ తోడు ఉండగా
కలత చెందకు నేస్తమా
మహోన్నతుడు తోడు ఉండగా

బలవంతుని చేతిలో బాణమే నీవు  }
బలహీనుడవు కావు పరాక్రమశాలివి } "2"
దిగులేలా.. భయమేలా...  "2"
శూరుని చేతిలో ఆయుధములాగ  "2"
దేవుడేనిన్ను ప్రయోగించునన్న  "2"
ఈ మాట నమ్మవా..
కృంగిపోకుమా నేస్తమా...
యేసు నీ తోడు ఉండగా
ఒంటరివికకావు నేస్తమా..
ప్రభువే నీ చేంతనుండగా
పేరుతో నిను పిలిచినా "2"
మహోన్నత దేవుని కృపను చూడవా "2"
                                              "కృంగి"

                     దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------*
                         రచన:స్వరకల్పన
               🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                  సెల్ నెంబర్:9948089237
                lvpaul9460.blogspot.com
                 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment