Wednesday, 3 June 2020

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంతకాలం

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంతకాలం   }
కష్టాలబాటలోన సాగదు పయనం          } "2"
విడుదల సమీపించును        }
నీకు వెలుగు ఉదయించును } "2"

నీవు మోసిన నిందకు ప్రతిగా
పూదండ ప్రభువు ఇచ్చునులే
నీవు పొందిన వేదనలన్ని
త్వరలో తీరిపోవునులే   "నీవు"
నీ స్థితిచూసి నవ్వినవారే   }
సిగ్గుపడే దినమొచ్చేనులే } "2"
                                    "విడుదల"
అనుభవించిన లేమి బాధలు
ఇకపై నీకు ఉండవులే
అక్కరలోను ఉన్నవారికి
నీవే మేలు చేసేవులే  "అనుభ"
మొదట నీ స్థితి కొంచమే ఉన్న }
తుదకు వృద్దిని పొందునులే     } "2"
                                    "విడుదల"

           దేవునికి మహిమ కలుగును గాక!
 *---------------------------------*

                             రచన&స్వరకల్పన
                         పాస్టర్ షాలేంరాజు గారు
                         తండ్రిసన్నిధి మినిస్ట్రీస్
    సేకరణ:
                  🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                     సెల్ నెంబర్:9948089237
                   lvpaul9460.blogspot.com
                    🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment