Saturday, 16 June 2018

నాకొకరు ఉన్నారు నన్ను ప్రేమించే వారు

నాకొకరు ఉన్నారు నన్ను ప్రేమించే వారు
నా ప్రియుడు యేసుక్రీస్తేగా...ఆ..ఆ..  "2"
ధవళవర్ణుడు రత్నవర్ణుడు   "2"
పదివేలలో అతి కాంక్షనీయుడు  "2"
                                  "నాకొకరు"
బండలాంటి రాతి గుండె నాకుండగా
తన ప్రేమతో నను కరిగించి మార్చెనుగా
పగిలిన పాత్రనై నేనుండగా
తన ప్రేమతో సరిచేసి నన్ను మార్చెనుగా  "బండ"
                                                       "ధవళ"
మరణ మార్గములో నేనుండగా
తన ప్రేమతో నా చేయిపట్టి లేపెనుగా
క్రీస్తుకు విరోధముగ నేనడువగా
తన ప్రేమతో నాహృదయాన్ని తాకెనుగా..  "మరణ"
                                                       "ధవళ"

           దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*

                 రచన&స్వరకల్పన
               బ్రదర్.వీరేష్  పల్లెపంగి

  సేకరణ:
         🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
             సెల్ నెంబర్:9948089237
           lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment