రోషముగల దేవుని కొరకూ....
రోషంగ బ్రతికే వాళ్ళు కొందరే
జీవముగల దేవుని కొరకూ...
సజీవయాగంగ బ్రతికెవాళ్ళు
కొందరే “రోషము”
కొందరిలో నీవున్నావా అన్నయ్యా...
}
అందరిలోగలిసి పోయి ఆగమైనవా } “2”
“రోషము”
1. ఎందరొ ఉన్నారు ఏమో చెబుతారు
}
బ్రతికిచూపరు యేసు ప్రేమలో } “2”
సచ్చిన స్థితిలోనే కుళ్ళివుంటరు }
ఎట్లాబ్రతికినా ఏమిచేసినా “2”
చూపాలి జీవితాన యేసుని
ప్రేమా “2”
రోషముగల దేవుని కొరకూ....
రోషంగ బ్రతికే వాళ్ళు కొందరే
జీవముగల దేవుని కొరకూ...
సజీవయాగంగ బ్రతికెవాళ్ళు
కొందరే
2.గడ్డి ఎండిపోయెను దాని
పువ్వు రాలెను
మన దేవుని వాక్యం నిత్యముండును
ఆత్మకు ఊపిరియై జీవమిచ్చును “గడ్డి”
అందం నీకున్నా ఆస్తులు
ఎన్నున్నా “2”
నీవెంట ఏదిరాదు అన్నీ సున్నా “2”
వాక్యమై ఉన్న ప్రభును మరువకూ...
మనుషుల తోడుచూసి మురువకు...
ధనాశ అసూయతో నిండకూ...
లక్కజెప్పె రోజుందని మరువకు..
3. కరులో కష్టములో కాకికి
ఆజ్ఞఇచ్చి }
ప్రభువే ప్రవక్తను పోషించెగా.. } “2”
తన వాక్కును పంపి నడిపించెగా..
}
రారాజు చేతిలో రాయభారిగా...
“2”
నిజమైన దేవుడని నిరూపించెగా
చరిత్రలో చిరస్థాయిగ నిలచిపోయెగా
రోషంగ బ్రతికినాడు ఏలియా...
అగ్ని రధములపై కొనిపోబడ్డాడుగా..
నీవెట్ల బ్రతుకుతున్నవన్నాయ్యా...
సతోషపడుతున్నడ యేసయ్యా...
4. కోతే విస్తారం పనివారికె
భారం }
కోసేటి పనిలోన ముందుకొస్తవా....
} “2”
వెనుదిరుగను నేనని మాట
ఇస్తవా }
పరీక్షలెన్నున్నా ఫలితాలేమైనా..
పనిలోన ప్రభు హస్తం తోడుంటుంది
ఫలాలన్ని పొందె రోజు నీకొకటుంది
జీవ కిరీటమే నీకొరకు సిద్దంగుంది
రోషముగల దేవుని కొరకూ....
రోషంగ బ్రతకాలనే రోషమున్నదా..
జీవము గల దేవుని కొరకూ...
ప్రాణమైన ఇస్తననే త్యాగమున్నదా
5. యేసయ్య పాదాలు ఓ చేత
పట్టుకొని }
సృష్టిని దీవించు మరో చేతితో.... } “2”
మనుషుల దీవించు అదే చేతితో.. }
దైవ కుమారుల ప్రత్యక్షతకై “2”
సృష్టి ఆశతో కనిపెడుతుంది
సృష్టిమిగుల ఆశతో కనిపెడుతుంది
ఎక్కదాగి పోయినవో చూసుకో....
చల్లారిన స్థితిని వదులుకో....
దేవునితో మనిషితో సరిచేసుకో...
మారుమనసు పొందినీవు నడుచుకో
6. బ్రతుకుట క్రీస్తని
చావైన మేలని }
తెగించి ప్రకటించు యేసు
వార్తను } “2”
తలొంచి భరియించు లోక శ్రమలను }
ప్రాణం పోయినా ప్రభునే
విడచినా.. “2”
హతసాక్షిగా మారి త్యాగమాయెనా
చరిత్రలోమనకు గొప్ప సాక్షి
ఆయెనా
రోషముగల దేవిని కొరకూ...
రోషంగ బ్రతకాలని నడుము
కట్టుకో
జీవము గల దేవిని కొరకూ...
ప్రాణమైన ఇస్తననే బాస చేసుకో
అందరిలో నీవుండొద్దు అన్నయ్యా }
యేసు మనసు కలిగి నీవు వెనుదిరుగొద్దు
} “2”
యేసు మనసు కలిగి నీవు వెనుదిరుగొద్దు “2”
రచన&స్వరకల్పన
పాస్టర్.శ్రీశైలం
గారు
శైలము ఫెయిత్ మినిస్టీస్
దేవునికి మహిమ కలుగును గాక!
*----------------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:KHAMMAM🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
*Praise The Lord*
No comments:
Post a Comment