Wednesday, 27 June 2018

యేసయ్యా నీవే నాకు జీవమైయున్నావు యేసయ్యా నీవే నాకు ఊపిరైయున్నావు


యేసయ్యా నీవే నాకు జీవమైయున్నావు
యేసయ్యా నీవే నాకు ఊపిరైయున్నావు
యేసయ్యా నీవే నాకు జీవమైయున్నావు
యేసయ్యా నీవే నాకు ప్రాణమైయున్నావు
నా హృదయ లోగిలిలో వెలుగువైయున్నావు “2”
నీ ప్రేమ సంద్రములోనే నాకు స్థానమిచ్చావు “2”
                                      యేసయ్యా
నీ ప్రేమకౌగిలిలో నన్ను బంధించావు  }
నీ రెక్కల నీడలో ఆశ్రయమునిచ్చావు  } “2”
కునకని నిదురపోని నా మంచి కాపరివే.......... “2”
శత్రుని పారద్రోలి నన్ను కాచినావయ్యా  “2”
                                      యేసయ్యా
నీవు నన్నెంతగానో ప్రేమించినావయ్యా  }
సిలువలో ప్రాణంబెట్టి రక్షించినావయ్యా  } “2”
నీ జీవ గ్రంధములో నా పేరు రాసితివే  “2”
యుగయుగములు జీవించే ధన్యతను ఇచ్చావు “2”
                                      యేసయ్యా
వేచియున్నాను నీ రాక కొరకేనయ్యా  }
ఈ నిరీక్షణ నన్ను సిగ్గు పరచదేసయ్యా } “2”
నాజీవిత అంతమువరకు రక్షణ కాపాడుకొందునే..........”2”
మహిమగల సియోనులో నిన్నుచూసి పరవసింతును “2”

        దేవునికి మహిమ కలుగును గాక!
 *-----------------------------------*

         రచన&స్వరకల్పన
       బ్రదర్.వీరేష్  పల్లెపంగి
  సేకరణ:
          🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
          సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment