Friday, 23 March 2018

కమ్మని బహుకమ్మని చల్లని అతి చల్లని

*కమ్మని బహుకమ్మని చల్లని అతి చల్లని*
*తెల్లని తేట తెల్లని*
*యేసు నీప్రేమామృతం        " 2 "*
*జుంటె తేనె కన్న మధురం*
*సర్వ జనులకు సుకృతం      " 2 "*
*యేసు నీ ప్రేమామృతం     " 2 "  కమ్మని "*

ఆశ చూపెను ఈ లోకం
మలినమాయెను నా జీవితం
యేసూ నీదు ప్రేమ
దయ చూపెను ఈ దీనురాలి పైన  " 2 "
వెలిగెను నాలో నీ ఆత్మ దీపము     " 2 "
కడిగిన ముత్యముగా అయ్యాను నేను " 2 "
                                          *"  కమ్మని  "*

నా కురులతో పరిమళమ్ములతో
చేసెద నీదు పాద సేవ
నా గుండె గుడిలో కొలువైయున్న
నీకు చేసెద నేను మధుర సేవ        " 2 "
ఆరాధింతును నిన్ను అనుదినము " 2 "
జీవింతును నీకై అనుక్షణము         " 2 "    
 .                                           *"  కమ్మని  "*


    *🎼  కేదారి   From   ఏలూరు  🎼*  
               *9393383018*
      Kedripididhi.blogspot.com

No comments:

Post a Comment