Tuesday, 20 March 2018

సువార్త దళము

*సువార్త దళము "4"*
*ఇంటిటా సువార్త దళము " 2"*
*యేసుని సువార్తను ప్రకటించెదం*
*యేసుకై ప్రాణాలను అర్పిచెదం*
                            *"సువార్త"*

కష్టములెన్నైనా కడగండ్లెయెదురైనా
నష్టము లెన్నైనా నిటూర్పులే అయినా  "2"
ఆత్మల రక్షణయే మా లక్షం
ఆనందముగనే సాగివెళ్ళెదం "2"
                                 *"సువార్త"*

బాధలు ఎన్నున్నా బలహీనతలే అయినా
ఎండలు ఎంతైనా ఎంతదూరమూరున్న  "2"
ఆత్మల రక్షణయే మాలక్షం
అలయకముందుకు సాగివెళ్ళెదం "2"
                           *"సువార్త "*

కరువులు ఎన్నైనా ఖడ్గములే ఎదురైనా
కంఠంతెగుతున్నా కాలి బూడిదవుతున్నా  "2"
ఆత్మల రక్షణయే మాలక్షం
లక్ష్యము చేయము మా ప్రాణం  "2"
                           *"సువార్త"*

     దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
      🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
         సెల్ నెంబర్:9948089237
       lvpaul9460.blogspot.com
          🙏*Praise The Lord*🙏

2 comments: