Thursday, 19 July 2018

నీరూపం నాలోన ప్రతిబింబమై వెలుగనీ.. నీ ప్రేమా.. నీ కరుణ. నా హృదిలోన ప్రవహించనీ


నీరూపం నాలోన ప్రతిబింబమై వెలుగనీ..          }
నీ ప్రేమా.. నీ కరుణ. నా హృదిలోన ప్రవహించనీ } “2”
రాజువు నీవేకదా.. నీ దసుడ నేనేకదా.. “2”
ప్రభు నీకోసం ప్రతి క్షణం జీవించనీ “2”
నీ రూపము నాలో ముద్రించనీ.. “2”
                         నీ రూపం
నాముందు నీవు ఎడారులన్నీ  }
నీటి ఊటలుగా మార్చెదవే..     } “2”
దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా “2”
ఆశీర్వాదము నీవే రాజా... “2”
                         నీ రూపం
నా పాపస్వభావం తొలగించుమయ్యా }
నీ మంచి ప్రేమా నాకీయుమా...       } “2”
నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి “2”
హృదయాసీనుడ నీవే రాజా..  “2”
                         నీ రూపం
అంధకారము వెలుగుగ మార్చి}
శాంతిమార్గములో  నడిపెదవే  } “2”
భయపడిన వేళలో తోడుగ నిలిచెదవే “2”
భుజమును తట్టి నడిపెదవు   “2”
                         నీ రూపం
ఆరాధన ఆరాధనా.... ఆరాధన ఆరాధనా.. “8”

         దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------*
             రచన&స్వరకల్పన
          బ్రదర్.ఆదాంబెన్ని గారు
          జీసెస్ హెల్ప్స్ మినిస్టీస్
         నర్సంపేట, వరంగల్ జిల్లా
  సేకరణ:
            🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
            lvpaul9460.blogspot.com
            🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment