బాధ్యత మరచిన బాటసారి నీ
పయనం ఎక్కడికీ }
బతుకు భారమును మోసుకుంటు
పరుగులు ఎక్కడికి } “2”
దేహమే శాశ్వతమా నీకు
దేవుడె చులకనాయే నీకు
నీ సొంతం అనుకున్నది రాలేదు
ఎక్కడికి
ఏ నాడు ఎప్పటికీ..
“బాధ్యత”
పాప శాపములచే చచ్చే నిన్ను
బ్రతికించ }
పరలోకవాసుడమ్మా నీకై మనిషిగ
పుట్టిండు }”2”
ఈ లోకం మందు నీవెట్లుండాలో
బ్రతికి నేర్పిండు
నీకు మాదిరి చూపిండు
తన జీవమిచ్చి నీకు ప్రాణమిచ్చిన
యేసుకే నీవు దూరమా
తన ప్రాణమిచ్చి నిను రక్షించిన
యేసయ్య సన్నిధికి చేరుమా
“బాధ్యత”
నీ చేతుల పాపములు తన చేతిలో
మేకులుగా }
నీరోగములన్నిటిని తన వీపున
కొరడా దెబ్బలుగా } “2”
భరియించి తన రక్తం కార్చి
నిను విడిపించాడు
కన్న ప్రేమను చూపాడు
తన అరచేతిలో నిను చెక్కిన
ఆ యేసునే నివు విడుతువా
తల్లి గర్భముననిను రూపించిన
సృష్టికర్తనే మరతువా
“బాధ్యత”
నీపాప భారమంతా తను సిలువగ
మోసిండు }
సైతాను శక్తులన్నీ సిలువలో
చితుకనె త్రొక్కిండు } “2”
ఓ తల్లి ఈ యేసు తక్తములొ
విడుదలుంది నీకు
చెల్లి రక్షణ నీకుంది
మరణాన్ని గెలిచిన పునరుద్దానుని
చేరవా ఓ సోదరా
వధియించిన ఈ గొర్రెపిల్ల
గాయాలను తేరి చూడవా
“బాధ్యత”
యేసు నామముననే నీకు రక్షణ
ఉందన్నా }
యేసుని రక్తముచే నీవు కడుగబడాలన్నా } “2”
ఓ తల్లి ఈ లోక పాపమును
విడిచిపెట్టు చెల్లి
పర లోకముంది తల్లి
పరము వీడి నరలోకమొచ్చే
నీ కోసమే ఆ యేసయ్యా
ఏ ఒక్కరు కూడా నరకం వెళ్ళుట
దేవుని ఇష్టం కాదయా
“బాధ్యత”
ఇది కల్లగాదురన్నా పిట్ట
కతలుగావు రన్నా }
బైబిలు చదువన్నా సత్యం
బయలుపడతదన్నా } “2”
సత్యమెరిగి ఈ నిత్యదేవిని
భక్తితోగొలువన్నా
నీకు ముక్తి కలుగునన్నా
పరము వీడి నరలోకమొచ్చే
నీ కోసమే ఆ యేసయ్యా
ఏ ఒక్కరు కూడా నరకం వెళ్ళుట
దేవుని ఇష్టం కాదయా
“బాధ్యత”
దేవునికి మహిమ కలుగును గాక!
*------------------------------------*
రచన:స్వరకల్పన
పాస్టర్.శ్రీశైలం గారు
శైలము ఫెయిత్ మినిస్టీస్
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment