Tuesday, 3 July 2018

వెదకని చోటే లేదు నా దేవుని కోసం


వెదకని చోటే లేదు నా దేవుని కోసం         }
వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం } “2”
వెదికితిని వేసారితిని అంతటాతిరిగితి ‘’2”
తను కానరాక నే కలత చెందితీ “2”
వేదనతో రోదనతో కన్నీరు కార్చితి
నాలోకి తొంగిచూస్తే నా గుండెలో ఉన్నాడు “2”
ప్రేమే దేవుని స్వభావము ప్రేమే జీవము “2”
                                      వెదకని
కొండలను కొండకోనల నడిగా
నా ప్రభువెక్కడని
సంద్రములను జలరాశులనడిగా
నా ప్రభువెక్కడని   కొండ
అడవులనడిగా.. అందుజీవులనడిగా... “2”
ఉలుకేలేదు పలుకే లేదు జవాబేలేదు
                               నాలోకి
రివ్వున ఎగిరే గువ్వలనడిగా
దేవుడు ఎక్కడని
సుమధురగానాల కోయిల నడిగా
నా ప్రభువెక్కడని  రివ్వున
జలజల పారే సెలయేటినడిగా...  “2”
ఉలుకేలేదు పలుకే లేదు జవాబేలేదు
                               నాలోకి

         దేవునికి మహిమ కలుగును గాక!
 *---------------------------------------*
  సేకరణ:
            🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
            lvpaul9460.blogspot.com
              🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment