Thursday, 5 July 2018

నాప్రాణప్రియుడా పరిశుద్దుడా అంతరంగ పాలకుడా అభిషక్తుడా


నాప్రాణప్రియుడా పరిశుద్దుడా    }
అంతరంగ పాలకుడా అభిషక్తుడా } “2”
హృదిలోని జీవం నీవే  }
మదిలోని రాగం నీవే   } “2”
జీవాధిపతివి వందనం... యేసయ్యా..
నా జీవితం నీకంకితం
                     నా ప్రాణ
తెలియని దారులేయైనా
తెలిసిన నీతో నడక
ఎండిన ఎడారులైనా
ఏదేనులా మారునంట
ఎంత ప్రేమ నాపై యేసయ్యా..........
ఇంతగానే చూపినావయా
                          నా ప్రాణ
కరువులే కోరలు చాచిన
ఖడ్గమే తలపై మెరసిన
కంఠాన కత్తులెరువ్విన
కడ శ్వాస కొంచమె ఉన్న
నీ కరుణలోనే కరుగెదా...........
నా కనులు నీపై ఉంచెదా..
                       నా ప్రాణ
పొలమనే లోకంలోనా
విత్తనపు వాక్యం మొలువా
నా జీవితం నలిగించి
వాడుకో ఎరువుగ మార్చి
మంటిపై మరువలేని ప్రేమా...........
ముద్రించు మహిమ సాధనంగా
                           నా ప్రాణ

      దేవునికి మహిమ కలుగును గాక!
 *------------------------------------*
           రచన:స్వరకల్పన
          పాస్టర్.శ్రీశైలం గారు
       శైలము ఫెయిత్ మినిస్టీస్
సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
       సెల్ నెంబర్:9948089237
       lvpaul9460.blogspot.com
          🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment