Thursday, 5 July 2018

హృదయమా కలత చెందకుమా ఓ మనసా చెమ్మగిల్లకుమా


హృదయమా కలత చెందకుమా
ఓ మనసా చెమ్మగిల్లకుమా
జీవము గల గొప్పదేవుడు
తోడు ఉన్నాడుగా........ “2”
                      హృదయమా
లోకపు కాకుల గావు కేకలకు              }
క్రుంగి పడిపోకుమా... కుప్పకూలకుమా.. } “2”
లోక రక్షకుడు నీలో ఉండగ
నీరసించకుమా...కన్నీరుకార్చకుమా...
హృదయమా... హృదయమా...
......... హృదయమా

ధనబల గర్వముతో సొంతవారే           }
దూరం చేసారా..నిను హేళన చేసారా... } “2”
శ్రీమంతుడే నీ వెన్నంటి ఉండగ
ఒంటరివి కాదుగా... తోడు ఉన్నాడుగా
హృదయమా కలత చెందకుమా
ఓ మనసా చెమ్మగిల్లకుమా

శోధన వేదన దూషణలెన్నైనా              }
ఇరుకు ఇబ్బంది ఇక్కటులెన్నైన           } “2”
దిగులు పడిపోకుమా..దిగిజారి పోకుమా.. }
ఇమ్మానుయేలు నీకు తోడు
ఆదుకుంటాడుగా..ఆశ్రయం ప్రభువేగా..
హృదయమా కలత చెందకుమా
ఓ మనసా చెమ్మగిల్లకుమా
జీవము గల గొప్పదేవుడు
తోడు ఉన్నాడుగా........ “2”
హృదయమా... హృదయమా...
......... హృదయమా

        దేవునికి మహిమ కలుగును గాక!
 *------------------------------------*
              రచన:స్వరకల్పన
             పాస్టర్.శ్రీశైలం గారు
          శైలము ఫెయిత్ మినిస్టీస్
  సేకరణ:
            🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
            lvpaul9460.blogspot.com
              🙏*Praise The Lord*🙏

1 comment: