హృదయమా కలత చెందకుమా
ఓ మనసా చెమ్మగిల్లకుమా
జీవము గల గొప్పదేవుడు
తోడు ఉన్నాడుగా....ఆ..ఆ.. “2”
“హృదయమా”
లోకపు కాకుల గావు కేకలకు
}
క్రుంగి పడిపోకుమా... కుప్పకూలకుమా.. } “2”
లోక రక్షకుడు నీలో ఉండగ
నీరసించకుమా...కన్నీరుకార్చకుమా...
హృదయమా... హృదయమా...
ఓ..ఓ..ఓ..ఓ... హృదయమా
ధనబల గర్వముతో సొంతవారే
}
దూరం చేసారా..నిను హేళన చేసారా... } “2”
శ్రీమంతుడే నీ వెన్నంటి
ఉండగ
ఒంటరివి కాదుగా... తోడు
ఉన్నాడుగా
హృదయమా కలత చెందకుమా
ఓ మనసా చెమ్మగిల్లకుమా
శోధన వేదన దూషణలెన్నైనా }
ఇరుకు ఇబ్బంది ఇక్కటులెన్నైన
} “2”
దిగులు పడిపోకుమా..దిగిజారి పోకుమా.. }
ఇమ్మానుయేలు నీకు తోడు
ఆదుకుంటాడుగా..ఆశ్రయం ప్రభువేగా..
హృదయమా కలత చెందకుమా
ఓ మనసా చెమ్మగిల్లకుమా
జీవము గల గొప్పదేవుడు
తోడు ఉన్నాడుగా....ఆ..ఆ.. “2”
హృదయమా... హృదయమా...
ఓ..ఓ..ఓ..ఓ... హృదయమా
దేవునికి మహిమ కలుగును గాక!
*------------------------------------*
రచన:స్వరకల్పన
పాస్టర్.శ్రీశైలం గారు
శైలము ఫెయిత్ మినిస్టీస్
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise
The Lord*🙏
Super song
ReplyDelete