Friday, 4 May 2018

నిన్నే నిన్నే నే చూడాలని ఆశనాలో ఉందిగా నా యేసయ్యా


నిన్నే నిన్నే నే చూడాలని
ఆశనాలో ఉందిగా నా యేసయ్యా
నీలో నేను జీవించాలని
ఆశగా ఉన్నాను నా యేసయ్యా  నిన్నే
నా యేసయ్యా.. నా యేసయ్యా..  }
నా యేసయ్యా.. నా యేసయ్యా..  }  “2”
                                           నిన్నే
ఒక్కక్షణమైన వీడిపోని
బంధమే నాకు పంచావు
అను క్షణం నన్ను ఆదరించిన
విడువని దేవుడు నాయేసయ్యా  ఒక్క
నా యేసయ్యా.. నా యేసయ్యా..  }
నా యేసయ్యా.. నా యేసయ్యా..  } “2”
                                          నిన్నే
నా కృప నిన్ను వీడదంటివే
నీ కృప నాకు చాలునయా
నీజీవ వాక్యమే నా జీవితమును
మార్చివేసెను నా యేసయ్యా  నా కృప
స్తోత్రము స్తుతి స్యోత్రము      }
నా యేసు రాజుకే స్తోత్రము  } “2”
                                      నిన్నే

  
          రచన&స్వరకల్పన
        బ్రదర్.వీరేష్  పల్లెపంగి
 
      దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏
 

నా యేసు చాలు ఈ జన్మకి నా తోడురారు వేరెవ్వరూ


నా యేసు చాలు ఈ జన్మకి  }
నా తోడురారు వేరెవ్వరూ    } “2”
కష్టాలకొలిమిలో కన్నీటిలోయలలో “2”
కనికరము చూపే నాధుడు    “2”
                              నా యేసు
అయిన వారే నను వెలివేసిన       }
అందరు దూషించి పరిహసించిన  } “2”
అదరణేనాకు కరువైనప్పుడు  “2”
ఆదరించి సేద తీర్చితివి  “2”
కనికరసంపన్నుడా...  }
కృప చూపు నాధుడా  } “2”

నా పాపముకై శ్రమలను సహించి      }
నా దోషముకై మరణము భరియించి } “2”
సిలువలో నాకై రక్తము కార్చిన  “2”
నిజ స్నేహితుడా నా యేసయ్యా  “2”
కనికరసంపన్నుడా...  }
కృప చూపు నాధుడా  } “2”
                     నా యేసయ్యా


           రచన&స్వరకల్పన
         బ్రదర్.వీరేష్  పల్లెపంగి
 

         దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏


ప్రాణ ప్రియుడా.. నా యేసయ్యా...


ప్రాణ ప్రియుడా.. నా యేసయ్యా...  “2”
నీ కొరకే నేను ఎదురు చూచుచున్నాను “2”
హల్లేలూయా..  హల్లేలూయా..              }
హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయా }  “2”

రాత్రివేళలో పరుండియుండి   }
నా ప్రాణ ప్రియుని వెదికితిని  }  “2”
కన్నులు మూసినా కన్నులు తెరచినా   }
నీరూపమే నాకు కానరాలేదు              } “2”
                                ప్రాణ ప్రియుడా
నేనిప్పుడే లేచెదనూ..            }
పట్టణము వెంబడి పోయెదను } “2”
సంతవీధిలోన రాజవీధిలోనా   }
నా ప్రాణ ప్రియుని వెదకెదను  }  “2”
                                ప్రాణ ప్రియుడా
ప్రార్ధన గదిలో నా మొరవినెనూ       }
నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను } “2”
నా యేసయ్యా.. నా యేసయ్యా..  }
నీవులేనిదే నే ఉండలేనయా...    } “2”
హల్లేలూయా.. హల్లేలూయా...             }
హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయా } “2”


                రచన&స్వరకల్పన
             బ్రదర్.వీరేష్  పల్లెపంగి

        దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏