Monday, 25 March 2019

నాకున్న ఆధారమా... యేసు

నాకున్న ఆధారమా... యేసు
నీవేహ నాప్రాణము......
నీ ప్త్రేమయే సత్యము దేవా
నీత్రోవలో నడుపుము...
                                     "నాకున్న"
ఫరో రధములను అతని సేనను  }
సంద్రములోనికి పడద్రోసినావు    } "2"
నీ బాహుబలముచేత శత్రువునుబంధించి
నీ ప్రజను తోడుకొనివచ్చినావు
వాగ్దానదేశమునకు నడిపించినావు "2"
                                        "నాకున్న"
నాకుమారుగా ప్రాణమువిడచి   }
నా దోషశిక్షను భరియించినావు } "2"
నీ వాక్యము చేత నా మదిని మార్చి
నీ శుద్ద ఆత్మతో నను నింపినావు
పరిశుద్దమార్గం నాకు బోధించావు "2"
                                        "నాకున్న"
నా చీకటిని వెలుగుగా మార్చి   }
నా పాదములకు దీపమైనావు  } "2"
ఏ హానికలుగకుండా నా కోటగ నిలచి
నీ జీవమార్గములోన నను నిలిపినావు
నీ రాజమార్గమునాకుచూపించావు "2"

           దేవునికి మహిమ కలుగును గాక!
 *----------------------------------*
  సేకరణ:
        🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
           సెల్ నెంబర్:9948089237
         lvpaul9460.blogspot.com
          🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment