కృపగల యేసయ్యా నీవు నాకు చాలయ్యా
నీ దయలో నేనుంటే అదే నాకు మేలయ్యా "2"
నా ఆరాధ్యుడవు నీవయ్యా...
నా స్తుతిస్తోత్రములు నీకయ్యా "2"
"కృప"
1. అలలెన్నో నాపై రేగినా... తుఫానులే గర్జించినా
నా దరి చేరావు తోడుగ నిలిచావు
గాలిని గద్దించి నెమ్మది నిచ్చావు
"నా ఆరాధ్యు""
2. శ్రమలెన్నో నాపై కొచ్చినా... శత్రువులే ఎదురునిలిచినా "2"
నా దరిచేరావు తోడుగ నిలిచావు
సాతన్ని ఓడించి విజయము నిచ్చావు
"నా ఆరాధ్యు"
3. శోధనలే నన్ను చుట్టినా గాడాంధకారమే కమ్మినా "2"
నా దరి చేరావు తోడుగ నిలిచావు
చీకటి తొలగించి వెలుగుగ మార్చావు
"నా ఆరాధ్యు"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment