నీవు నాకు తోడైయుండగా...
ఏ లోటు రానీయవూ...
నీవు నా ప్రక్కనుండగా...
ఏ భయము కలుగనీయవూ... "2"
జయమే..నాకెపుడూ
అపజయమే.. లేదెపుడూ "2"
ఆరాధన చేసెదా అద్వితీయుడా...
ఆరాధన చేసెదా జయశీలుడా "2"
1. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసీ
శాంతికరమైన జలము త్రాగించువాడవు "2"
అతిశ్రేష్టమైన వాటితో నను పోషించి..
కొండతేనేతో తృప్తి పరచువాడవూ... "2"
"జయమే"
2. గాడాంధకార లోయలో నేను సంచరించిననూ "2"
ఏ అపాయము నాకు రానీయవూ...
నీ దుడ్డుకర్ర దండము నన్నాదరించును "2"
"జయమే"
3. పదివేలమంది నాపై.. దండెత్తి వచ్చినా...
పదిలముగా నేనుందునూ.... "2"
నా రక్షణకర్తవైన నీవు... తోడైయుండగా
నా దేవుడవు నీవే... నాతో ఉండగా... "2"
"జయమే"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment