Monday, 8 March 2021

ఎందుకయ్య.. యేసయ్యా... ఇంతప్రేమ... నీకయ్యా...

 ఎందుకయ్య.. యేసయ్యా...
ఇంతప్రేమ... నీకయ్యా...
రక్తమిచ్చినావయ్యా... ప్రాణమిచ్చినావయ్యా...
జాలిగా నన్నే చూసినావయ్యా.... "2"
నా ప్రాణనాధుడా... నా ప్రాణేశ్వరుడా...
నా ప్రాణములొ ప్రాణమై ఉన్న నాధుడా  "2"
                                              "ఎందుకయ్య"
1. ఏమంచి లేకున్నా - నన్ను ఎంచుకున్నావు
అర్హతలేకున్నా - యోగ్యునిగా ఎంచావు "2"
నేను నిన్ను చూడకున్నా - నన్ను నీవు చూశావు "2"
విడువక... నా యెడ కృపచూపుచున్నావు
                                                         "నా ప్రాణ"
2. జ్ఞానమేమి లేకున్నా - నన్ను ఎంచుకున్నావు
జ్ఞానాత్మతోనింపి - జ్ఞానిగా చేశావు  "2"
నేను నిన్ను అడుగకున్న - అన్ని నీవే ఇచ్చావు
విడువక... నా యెడ కృపచూపుచున్నావు
                                                          "నా ప్రాణ"
3. ఎనికలేకున్నా - నన్ను ఎంచుకున్నావు
నీ ఆత్మతో నింపి - నన్ను నడుపుచున్నావు "2"
నేను నిన్ను కోరకున్నా - నన్ను నీవే కోరావు "2"
విడువక... నా యెడ కృపచూపుచున్నావు
                                                        "నా ప్రాణ"

 

            దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------*
                      పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
                         కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
  సేకరణ:
                     🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                        సెల్ నెంబర్:9948089237
                      lvpaul9460.blogspot.com
                        🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment