నీకొరకే ఉన్నాను... సమర్పించుకున్నాను...
బ్రతికితే నీ కొరకే.... బ్రతికెద యేసయ్యా....
ఇలలో నీసాక్షిగా... జీవించెద యేసయ్యా... "2"
నా ప్రాణ దేహముతో... నిన్ను మహిమ పరచెదా...
నా సాక్షజీవితంతో... నిన్ను ఘనపరచెదా... "2"
"నీకొరకే"
1. నశింయించే లోకంలో....
క్షణమాత్రపు సుఖములకు లొంగకా...
యోసేపులా... ఫలియించే కొమ్మనై
నీ పొలములో ఫలియించెదా.. యేసయ్యా.... "2"
"నా ప్రాణ"
2. శరీరాశ నేత్రాశ...
జీవపు డంబముకు లోంగకా....
నోవాహులా నీతిమంతుడనై
నీ దృష్టిలో... కృప పొందెదా... యేసయ్యా... "2"
"నా ప్రాణ"
3. ఏస్థితిలో నేనున్నా...
ఆ స్థితిచూసి... కృంగిపోక
దావీదులా... హృదయానుసారుడనై
నీ దయనూ... నేపొందెదా.. యేసయ్యా... "2"
"నా ప్రాణ"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Thanks for sharing. Telugu Christian Lyrics
ReplyDelete