Monday, 8 March 2021

నీతో మాట్లాడాలని ఉంది యేసయ్యా నిన్ను చూడాలని ఉంది యేసయ్యా

 నీతో మాట్లాడాలని ఉంది యేసయ్యా
నిన్ను చూడాలని ఉంది యేసయ్యా "2"
నీ రాజ్యానికి నేనెలా చేరాలో....
నీతో కలసి నేనెలా ఉండాలో.... "2"
నేర్చుకోవాలనే ఆశగ ఉందయ్యా... "2"
నాకూ నేర్పించు నా మంచి బోధకుడా...
                                                    .   "నీతో"
1. బంగారపు వీధులలో తిరగాలనీ
ఆకలిలేని రాజ్యంలో ఉండాలనీ.... "2"
నీ కుడి పార్శము నందు.. కూర్చోవాలని
పరలోక మన్నానూ భుజించాలనీ
ఆశగ ఉందయ్యా.. ఎంతో ఆశగ ఉందయ్యా... "2"
                                                             "నీతో"
2. జీవకిరీటం పడిపోకుండా పట్టుకోవాలని
నీ ఆలయంలో స్థంభముగా ఉండాలనీ...
నూతనమైన యెరూషలేములో నీ పేరును
నాపై రాస్తేచూడాలనే ఆశగా ఉందయ్యా "2"
ఆశగా ఉందయ్యా.... ఎంతో ఆశగా ఉందయ్యా "2"
                                                            "నీతో"


           దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------*
                      పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
                         కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
  సేకరణ:
                     🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                       సెల్ నెంబర్:9948089237
                     lvpaul9460.blogspot.com
                      🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment