Monday, 8 March 2021

విడువకు యేసయ్యా... ఎడబాయకయ్యా

 కృపచూపువాడా... బలపరచువాడా...
కన్నీరు విడువకుండా... నా కన్నులను
జారిపోకుండా నా పాదములను "2"
నిలుపుము దేవా బండపైన
నిత్యము నిలుపుము నీలోనే దేవా... "2"
విడువకు యేసయ్యా... ఎడబాయకయ్యా
నీవే లేకుండా నేనుండలేనయ్యా "2"  "కృప"
1. నా పాపదోషములే .... నను కప్పివేయగా
అంధకారమే.... నను ఆవరించగా.... "2"
నా సహాయమా... నీవే నాకు ఆధారం "2"
నీవుగాక వేరెవ్వరు నాకు లేరు యేసయ్యా... "విడు"
2. నా శత్రువులే... అధికమై ఉన్నారు
నా ప్రేమకు ప్రతిగా... ద్వేషించుచున్నారు "2"
నా సహాయమా... నీవే నాకు ఆధారం
నీవుగాక వేరెవ్వరు నాకు లేరు యేసయ్యా... "విడు"
3. సాగిపోయే నీడవలె... క్షీణించుచున్నాను
పుష్టి తగ్గిపోయెను... నా దేహము
బలహీనమాయెనూ... నా అంతరంగము
నా సహాయమా... నీవే నాకు ఆధారం
నీవుగాక వేరెవ్వరు నాకు లేరు యేసయ్యా... "విడు"

 

            దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------*
                      పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
                         కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
  సేకరణ:
                   🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                      సెల్ నెంబర్:9948089237
                  lvpaul9460.blogspot.com
                   🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment