Monday, 8 March 2021

బంగారమా.. మేలిమి బంగారమా...

 బంగారమా.. మేలిమి బంగారమా... "2"
నీవెట్లు మందగిలితివే బంగారమా...
నీ వెట్లు మార్చబడితివే బంగారమా....
ఓ సియోను ప్రియ కుమారుడా...
ఓ సియోను ప్రియ కుమారి....
మంటికుండగా నీవెలా మార్చబడితివి... "2"
                                                          "బంగా"
1. ప్రతిష్ఠితమైన రాయిగ నిను చేసి
ఎంతో విలువనిచ్చే నా యేసుడూ.... "2"
లోకమనే పాపములో పడిపోయి నీవు "2"
నీ విలువనెలా... కోల్పోతివి... "2"
                                                    "ఓ సియోను"
2. రాజకుమారునిగా నిన్ను ఎంచుకోని
విలివైన తన ప్రాణమిచ్చెను నా యేసుడూ "2"
సుకుమార భోజనము చేసే నీవూ...
దిక్కులేక వీధులలో పడియున్నావా.... "2"
                                                 "ఓ సియోను"
3. హిమము కంటే శుద్దమైనవానిగ నిను చేసి
పాలకంటే తెల్లని రూపమిచ్చె నా యేసుడూ.. "2"
పగడము కంటే ఎర్రగా మెరిసే నీవూ....
బొగ్గువంటి నలుపుగా మారిపోయావా... "2"
                                              "ఓ సియోను"


           దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------*
                      పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
                         కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
  సేకరణ:
                    🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
                       సెల్ నెంబర్:9948089237
                     lvpaul9460.blogspot.com
                      🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment