నీవున్నావనే నే బ్రతుకుచున్నది
నీ కృపయే నన్ను బలపరచుచున్నది
హస్తముచాపావు నన్నాదరించావు "2"
నీ రెక్కల నీడలొ నన్ను దాచావు "2"
అబ్బా తండ్రీ నీకేనయ్యా నా ఆరాధన నీకేనయ్యా "2"
ఆరాధన నీకేనయ్యా నా ఆరాధన నీకేనయ్యా "2"
"నీవున్నావనే"
1. దిగులుపడిన వేళ నా దరిచేరావు
కృంగిన వేళ నన్ను లేవనెత్తావూ
మా అమ్మలా నన్ను ఆదరించావు
మా నాన్నలా నన్ను లేవనెత్తావూ "2"
"అబ్బా"
2. అలసిన వేళ నా దరి చేరావు
సొమ్మసిల్లిన వేళ హత్తుకున్నావూ
మా అమ్మలా నన్ను ఆదరించావు
మా నాన్నలా నన్ను హత్తుకున్నావూ "2"
"అబ్బా"
3. ఒంటరి వేళ నా దరిచేరావూ
ఏడ్చిన వేళ నన్ను ఓదార్చావూ
మా అమ్మలా నన్ను ఆదరించావు
మా నాన్నలా నన్ను ఓదార్చావూ "2"
"అబ్బా"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
పాస్టర్.నతానియేల్ రాజ్ గారు
కల్వరి ఆదరణ మీనిస్త్రీస్
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment