Sunday, 29 April 2018

విడువకు ఎడబాయకు నిత్యము నడుపుము ఆదాంబెన్ని గారి పాట


విడువకు ఎడబాయకు
నిత్యము నడుపుము
నను నిత్యము నడుపుము
క్షణమైనా ఓ యేసయ్యా...
ఒక దినమైనా నా యేసయ్యా
దేవా..... యేసయ్యా...నా దేవా యేసయ్యా
                                   విడువకు
ఆత్మీయ యాత్రలోనా
ఆటంకములు ఎన్నెన్నో
పెనుతుఫాను గాలిలోనా
చిక్కిపోయెను నా నావ  ఆత్మీయ
సిడిగాలులో వేసారితినీ...
అలసినాను దేవా ఆదుకొనగా రావా
                                   విడువకు       
నీవుగాక వేరెవ్వరూ
నాకు ఇలలో లేరయ్యా
నిన్ను వీడి ఏ క్షణము
నేను బ్రతుకలేనయ్యా   నీవుగాక
సన్నిధిలో గోజాడితినీ...
ఆదరించుమా దేవా సేద దీర్చరావా
                                   విడువకు        

            దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో


సిలువలో ఆ సిలువలో  ఆ ఘోర కల్వరిలో
తులువలా మద్యలో  వ్రేలాడిన యేసయ్యా
వెలియైన యేసయ్యా.. బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా
                                 సిలువలో
నేరము చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు
కొరాడాలు ఛెళ్ళున చీల్చెనే నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువునే రుధిరంపు ధారలే
                                         వెలియైన
వధకు సిధ్ధమైన గొర్రెపిల్ల వోలే
మోమున ఉమ్మి వేయ మౌనివైనావే
దూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా
                                         వెలియైన
నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసే
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించే
నీవికార్చిన రక్తధారలే నా రక్షణకాధారం
సిలువను చేరెదను విరిగిన హృదయముతోను
                                         వెలియైన

           దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

చేతులెత్తి స్తోత్రమువేసి ఆరాధిస్తున్నా...ఆత్మ నాధుడా


చేతులెత్తి స్తోత్రమువేసి
ఆరాధిస్తున్నా...ఆత్మ నాధుడా
నిన్నే ఆరాధిస్తున్నా.. ఆత్మ నాధుడా
                                 చేతులెత్తి
కన్నులు తెరచి నిన్నే చూసి             }
నన్నేమరచితినీ  నా వరుడవునీవనీ  }  “2”
అయ్యా నన్నే మరచితినీ     }
నా వరుడవునీవనీ             }  “2”
                                 చేతులెత్తి
నోరుతెరచి గానముచేసి                        }
నిన్నే పాడెదనూ...కీర్తనీయుడ నీవని  }  “2”
అయ్యా నిన్నే పాడెదనూ...   }
కీర్తనీయుడ నీవని              }  “2”
                                 చేతులెత్తి
శిరమును వంచి చేతులుజోడించి         }
వందనం చేస్తున్నా...ఉన్నతుడనీవనీ  }  “2”
అయ్యా వందనం చేస్తున్నా...  }
ఉన్నతుడనీవనీ                   }  “2”
                                 చేతులెత్తి
మోకరించి ప్రార్ధన చేసి                     }
నిన్నే నమ్మితినీ...నాకున్నది నీవనీ  }   “2”
అయ్యా నిన్నే నమ్మితినీ...  }
నాకున్నది నీవనీ             }   “2”
                                 చేతులెత్తి     
సాగిలపడి నమస్కరించి                       }
ఆరాధిస్తున్నా...సర్వోన్నతుడవు నీవనీ  }  “2”
అయ్యా ఆరాధిస్తున్నా...       }
సర్వోన్నతుడవు నీవనీ        }  “2”
                                 చేతులెత్తి     
కన్నీళ్ళు విడచి నీ పాదాలు కడిగి            }
పూజలు చేస్తున్నా...మహరాజువు నీవనీ  } “2”            
అయ్యా పూజలు చేస్తున్నా...    }
మహరాజువు నీవనీ                } “2”
                                 చేతులెత్తి      

           దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

కల్యాణం కమనీయం


కల్యాణం కమనీయం            }
ఈ సమయం అతిమధురం     }  “2”
దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా  “2”
                                   కల్యాణం
ఏదేనువనమున యెహోవ దేవా    }
మొదటి వివాహము చేసితివే       }  “2”
ఈ శుభదినమున నవ దంపతులను   “2”
నీ దీవెనలతో నింపుమయా      “2”
                                   కల్యాణం
కానా విందులో అక్కరలెరిగి       }
నీళ్ళను రసముగ మార్చితివే     }   “2”
కష్టములలో నీవే అండగనుండి      “2”
కొరతలు తీర్చి నడుపుమయా      “2”
                                   కల్యాణం
బుధ్ధియు జ్ఞానము సంపదలన్నియూ     }
గుప్తమైయున్నవి నీయందే                   }  “2”
ఇహపర సుఖములు మెండుగనొసగి     “2”
ఇల వర్ధిల్లగజేయుమయా          “2”


           దేవునికి మహిమ కలుగును గాక
 *-------------------------------------------*
  సేకరణ:
             🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏