Monday, 2 April 2018
పలికిన దేవుడు మాట తప్పడు
*పలికిన దేవుడు మాట తప్పడు* }
*ఆయన మాటలెప్పుడు నేలనపడవు* } "2"
*భూమ్యాకాశములు గతియించినా...* }
*ఆయన మాటలెప్పుడు గతితియించవు* } "2"
*ఆయన మాటలే నెరవేర్చను*
*"పలికిన"*
మండుచున్న పొదలనుండీ
మోషేను పిలిచెగదా
ఉన్నవాడ ననువాడననీ...
నీతోవుంట నాతోరమ్మని.. "మండుచున్న"
ఎర్రసంద్రాలెన్ని ఎగిసొచ్చినా...
విరోధి ఫరోలెందరెదురొచ్చినా...
నిన్ను పిలచిన ప్రభువు నమ్మదగిన యేసు
నమ్మిఅడుగెయ్యి సోదరా...ఆ...ఆ...ఆ... }
గమ్యము చేర్చునాయనా..... } "2"
*"పలికిన"*
షడ్రక్ మెషెక్ అబెద్నేగో
శ్రమలను చూసెగదా
సైన్యములకధిపతిననీ...
అగ్నిలో అండనిలిచెనే... "షడ్రక్"
శోధనంటి జ్వాలలెన్ని ప్రజ్వలించినా...
లోకాధికారులే నిన్నడ్డగించినా...
జ్వాలనిన్ను కాల్చలేదు జనము నిన్ము ఆపలేరు
రక్షిచ సమర్ధుడన్నా...ఆ...ఆ...ఆ... }
రారాజు బిడ్డవు అన్నా.... } "2"
*"పలికిన"*
చేపలజాలరైనా
పేతురును పిలిచెగదా
రక్షకుడనేనేననీ....
వెంబడిప నాతోరమ్మని... "చేపల"
మనుషులపట్టుజాలరిగ మార్చెనా...
సిలువ సువార్త సాక్షిగా మార్చెనా...
బంధకాలెన్నైనా చెరసాలలే అయినా
చింతించి కృంగిపోకుమా...ఆ...ఆ...యేసు }
చెంతనుంటే ఎంతో ధన్యత.... } "2"
*"పలికిన"*
ఇంతగొప్ప సాక్షి సమూహం
మన ఎదుటనె ఉంది
జీవము గల దేవుడు...
జీవిస్తూనీతో ఉన్నడూ... "ఇంత"
లోకములో శ్రమలునీకు ఎన్నికలిగినా...}
లోకాన్నిజయించిన ప్రభును చూడవా...} "2"
జడియకు సోదరుడా జయమే ఇలలోనా..
యేసే ఆధారమూ....యేసే మన గమ్యము
*"పలికిన"*
🎼✍రచన&స్వరకల్పన✍🎼
*పాస్టర్.శ్రీశైలం గారు*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏 *Prise TheLord* 🙏
Subscribe to:
Post Comments (Atom)
Excellent song
ReplyDelete