Monday, 2 April 2018

నీ మాట నా పాటగా అను క్షణం పాడనీ

*నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ* *లోకాన నిను చాటగా - నా స్వరం వాడనీ* *నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ* *ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..* *"నీ మాట"* ఏ చోట గళమెత్తినా - నీ ప్రేమ ధ్వనియించనీ పాడేటి ప్రతి పాటలో - నీ రూపు కనిపించనీ "2" వినిపించుచున్నప్పుడే - ఉద్రేకమును రేపక స్థిరమైన ఉజ్జీవము - లోలోన రగిలించనీ నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ.. *"నీ మాట"* నీ దివ్య గానామృతం - జలధారలుగా పొంగనీ తాకేటి ప్రతి వారినీ - ఫలవంతముగా మార్చనీ "2" శృతిలయలు లోపించక - విసిగింపు కలిగించక నిజమైన ఉల్లాసమై - నిలువెల్లా కదిలించనీ నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ.. *"నీ మాట"* ఆత్మీయ గీతాలతో - తనువంతా పులకించనీ సంగీతమే భోధయై - కనువిప్పు కలిగించనీ "2" కాలక్షేపం కోసమే - పరిమితము కాకుండగా హృదయాల్లో నివసించుచూ - కార్యాలు జరిగించనీ నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ.. *"నీ మాట"* దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment