Monday, 2 April 2018

శ్రమలలోను సంతోషములోను నురతము నిన్ను ఆరాధించెదము

*ప్రియ సహోదరీ సహోదరుడా ! శ్రమలలో కృంగిపోతున్నవా  ?  సమాజం నిందలతో నిన్ను వెలివేసిందా  ?  బహు ఘోరమైన శాపముతో విసిగి అలమటించిపోయావా ? ఈ లోకంలో నాకు ఎవరున్నారని అని కుమిలిపోతున్నావా  ?  యేసయ్యను  అంగీకరించు .  ఎవరు నిన్ను చేయి విడిచినా  ?   యేసయ్య మాత్రం చేయి విడువడు . విశ్వాసముతో ఈ క్షణమే కన్నీటితో ఆరాదించు. పలు విధమైన కష్టాలతోను , వ్యాధులతోను , కుటుంబ సమస్యలతోను కన్నీటితో కుమిలిపోతున్న నా ప్రియ సహోదరీ సహోదరులారా . నువ్వు కన్నీళ్లతో కుమిలిపోవడం నా యేసయ్య ఉద్దేశ్యం కాదు. ఇదిగో నీ కోసమే ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వాలని అశపడుతున్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే ,  కన్నీటితో ఆరాదించు  , కన్నీటితో ఆరాదించు. శ్రమలలోను , సంతోషంలోను , నిరతము నిను ఆరాధించేదను యేసయ్య అని , అందరం కలసి ఆరాధన చేద్దామా  ?* శ్రమలలోను సంతోషంలోను.    } నిరతము నిను ఆరాధించేదను }  " 2 " తరగని నీ కృపలను తలంచి     } తనివితీరగా నిను స్తుతించెదను}  " 2 " *నీవే నీవే ఆరాదన నీవే యేసు* *నీకే నీకే ఆరాదన నీకే* *నీవే నీవే నీవే స్తుతి* *ఆరాధన నీవే యేసు* *నీకే నీకే నీకే స్తుతి ఆరాదన నీకే*                   "  1  " *సొంత బంధువులే నిను నిందించారా ? అవమానించి నిను వెలివేసారా  ? అందరు నీ చేయి విడిచినా , నీ చేయి విడువనటువంటి దేవుడు ఆ యేసయ్య. నీవు కన్నీటితో ఉన్నప్పుడు , ఆయన కృప నీకు అండగా ఉండి , నీ కన్నీరు తుడచి ఓదార్చే దేవుడు ఆ యేసయ్య మాత్రమే. విశ్వాసముంచు నేస్తమా ,  ఈ క్షణమే అద్భుతాన్ని చూస్తావ్* బందువులందరు నిందించినను } అవమానించి వెలివేసినను        } ' 2 " కన్నీటితో నీ శరణు వేడగా.       } కన్నీరు తుడిచి కృప చూపితివి } " 2 "        *"  నీవే నీవే ఆరాధన  "  శ్రమలలోను "*                  "  2  " *ఈ లోకంలో కష్టాలన్నీ నిను వదలక వెంటాడుతున్నాయా  ?  నిను పెనవేసుకొని కృంగదీస్తున్నాయా  ?  యేసయ్య ఉచిత కృప నిను వెన్నంటగానే , నీ కష్టాలన్నీ తొలగిపోయి , క్షణములోనే నీ జీవితాన్నీ మార్చే దేవుడు ఆయేసయ్య మాత్రమే . తన అమూల్యమైన కృపలో కాచి కాపాడిన యేసయ్యకు ఏమిచ్చి ఋణం తీర్చగలం. సహోదరీ సహోదరుడా మనసారా ఆరాధించడం తప్పా* ఈ లోకమున కష్ట సుఖాలు.      } వదలక నన్ను వెంటాడినను.     } " 2 " నీ కృపను నేనెన్నగా ప్రభువా.    } క్షణము నా బ్రతుకును మర్చితివి. } " 2 "       *"  నీవే నీవే ఆరాధన "  శ్రమలలోను "*             "   3  " *ఈ లోక ఆశలతో చెడిపోయి ,  యేసయ్యకు దూరస్థునిగా బ్రతుకుతున్న సహోదరీ సహోదరుడా ,  ఈ క్షణమే నిను పేరుపెట్టి తన చెంతకు పిలుస్తున్నాడు. నీవే నా సొత్తు అని పేరుపెట్టి పిలిచి, నీకు నూతనమైన జీవితాన్ని ఇవ్వాలని అశపడుచున్నాడు ఆ యేసయ్య. ఆయన చెంతకు రా  ,  ఆరాదించు మనసారా* దూరస్తూనిగా ఉండిన నన్ను     } పేరుపెట్టి నను పిలిచితివి.         } " 2 " నీవు నా సొత్తు అని నను పిలచి} జయజీవితమును నాకిచ్చితివి.} " 2 "       *"  నీవే నీవే ఆరాధన "  శ్రమలలోను "*           దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment