Tuesday, 3 April 2018

యేసుని నామములో

యేసుని నామములో – మన బాధలు పోవును
దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమొచ్చును
మృతులకు నిండు జీవమొచ్చును
హృదయములో నెమ్మదొచ్చును
యేసు రక్తముకే – యేసు నామముకే
యుగయుగములకూ మహిమే
అభిషిక్తులగు తన దాసులకు
ప్రతి సమయమునా జయమే
                              *"యేసుని"*
ఘోరమైన వ్యాధులెన్నైనా
మార్పులేని వ్యసనపరులైనా
 ఆర్ధికముగా లోటులెన్నున్నా
ఆశలు నిరాశలే ఐనా
ప్రభుయేసుని నమ్మినచో 
నీవు విడుదలనొందెదవు
పరివర్తన చెందినచో
పరలోకం చేరెదవు
                    *"యేసు రక్తముకే"*
రాజువైనా యాజకుడవైనా
నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా
ఆశ్రయముగా గృహములెన్నున్నా
నిలువ నీడే నీకు లేకున్నా
శ్రీ యేసుని నామమున
విశ్వాసము నీకున్నా
నీ స్థితి నేడేదైనా
నిత్యజీవము పొందెదవు
                    *"యేసు రక్తముకే"*
  దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
          సెల్ నెంబర్:9948089237
        lvpaul9460.blogspot.com
         🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment