Monday, 2 April 2018
బహుగా బహు బహుగా నను దీవించెను
*బహుగా బహు బహు బహుగా*
*నను దీవించెను-తన కృపలోన*
*నన్ను దాచియుంచెను " 2 "*
*తన మహిమతో నాతో మాట్లాడును*
*అరచేతిలో నన్ను చెక్కియుంచెను*
*విడువని దేవుడు నన్నెన్నడు ఎడబాయడు*
*" బహుగా "*
నా యెడల నీ తలంపులు విస్తరములు
అవి లెక్కించిన లెక్కకు మించియున్నవి
నా పాప బ్రతుకంతా జ్ఞాపకము చేసికొనక
నీ సాక్షిగా నన్ను నిలువబెట్టినవయ్యా " 2 "
అబ్రాహాము దేవుడవు-అద్వితీయుడవు నీవు
అందరికి ప్రభువైన - ఆదరణ కర్తవు
ఏమని పాడెదను నీ శాశ్వత ప్రేమకై
ఏమని చాటెదను నీ నిత్యమైన కృపకై
*" బహుగా "*
నాతల్లి గర్భమందే నన్ను ప్రతిష్టించితివి
నీకొసమే నన్ను ఏర్పరుచుకుంటివి
నా మట్టుకు బ్రతుకు క్రీస్తు చావైతే లాభమే
నీకోసమే నేను సైనికుడనైతిని " 2 "
నా దేవ దేవుడవు-నా ప్రాణ ప్రియుడవు
నరులందరి ప్రభువైన - న్యాయాధిపతి నీవు
ఏమని పాడెదను నీ శాశ్వత ప్రేమకై
ఏమని చాటెదను నీ నిత్యమైన కృపకై
*" బహుగా "*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment