Tuesday, 10 April 2018

కళ్ళల్లో కన్నీరెందుకూ గుండెల్లో దిగులెందుకు కళ్ళల్లో కన్నీరెందుకూ గుండెల్లో దిగులెందుకు


కళ్ళల్లో కన్నీరెందుకూ 
గుండెల్లో దిగులెందుకు 
ఇక నీవు కలత చెందకూ
నెమ్మది లేకున్మదా 
గుండెల్లో గాయమైనదా 
ఇక అవి ఉండ బోవుగా
యేసే నీ రక్షణ యేసే నీ నీరీక్షణ “2”   
                                             “కళ్ళల్లో”
హోరుగాలులు వీచగా తుఫానులు చెలరేగగా
మాట మాత్రము సెలవియ్యగ నిమ్మళమాయెనుగా
యేసే నీ నావిక భయముచెందకు నీవిక
యేసే నీ రక్షణ కలతచెందకు నీవిక 
                                             “కళ్ళల్లో”
కరువు ఖడ్గము లొచ్చినా నిందవేదన చుట్టిన
లోకమంతా ఏకమైన భయము చెందకుమా
యేసే నీ రక్షకా దిగులు చెందకు నీవిక
యేసే విమోచక సంతసించుము నీవిక    
                                              “కళ్ళల్లో”


          దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment