Monday, 2 April 2018
వరుడా నిన్నే ఊహిచుకుంటూ నన్నే మరచాను నీతో ఉంటూ
*వరుడా నిన్నే ఊహించుకుంటూ*
*నన్నే మరచాను నీతో ఉంటూ*
*నా ప్రపంచమే నీవంటూ*
*ప్రియుడా నీతో పెనవేసుకుంటూ*
*నాతో పోరాడుచు నాకెవరంటూ*
*నా విజయం నీవంటూ*
*వేచియుండెదను నీ కార్యములకై*
*లేవనెత్తుదవు క్షేమామృతముకై " 2 "*
*మహిమ ఘనత ప్రభావములకు*
*అర్హుడవేయని*
*ఆనంద గాణాలతో నిరతం ఆరాదించెదను*
పోరాడుచున్న లోక నియమాలలో
నను వెంబడించినది నీప్రేమయే " 2 "
ఇహలోక శ్రమలన్నియును సంగీతమైమారునే
బలమైన కార్యములన్నీ నీవలన సాధ్యమే
నీ దివ్య సన్నిధిలో నే కుశలమే *"మహిమ"*
వర్ణించలేని నీ మహిమలోన
యుగయుగములన్నిటిలో నివసించేదా" 2 "
పరలోక పరివారముతో
పరవశించి పాడుచూ ప్రవచన నెరవేర్పులన్ని కనులారచూచుచూ
నీప్రేమ సీమలో హర్షించేద *" మహిమ "*
రాగాలతోనే మేఘాలపైన
నిను చేరుకోనుటయే నా అభిలాషయే" 2 "
నాలుగు జీవులు నిత్యం నిన్ను కీర్తించుచుండగా సాగిలపడి పెద్దలందరూ
కిరీటములనే తీయగా
వినయముగా తలవంచి కృప నొందెద
*" మహిమ "*
ఇహ పరము నందు యోగ్యుడవు నీవని
ముద్రలు గల గ్రంధమును తెరచేందుకు" 2 "
కోట్లాది దూతలందరూ
బలమైన స్వరములతోనే
స్తోత్ర గాణాలు చేయుచూ మహిమనారోపించగా
మైమరచి నీయెదుట నేఆడనా *" మహిమ "*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment