Tuesday, 10 April 2018

ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా


ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా 
నవజీవన మార్గమునా నన్ను నడిపంచుమా
ఊఊహించలేనే నీకృపలేని క్షణము 
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే 
                                                 “ఆశ్రయ”
లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే 
ఆత్మీయులతోఅక్షయ అనుబంధం అనుగ్రహించితివే “2”
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి “2” 
                                                “ఆశ్రయ”
నాతోనీవు చేసిన నిబంధనలన్నియూ  నెరవేర్చుచుంటివే
నీతో చేసిన తీర్మానములు స్థిరపచితివే “2”
అందుకు ఈ స్తుతిఘన మహిమల స్తోత్రాంజలి “2” 
                                               “ఆశ్రయ”
పరవానైతిని వాగ్దానములకు వారసత్యమును 
నీక్షణలో అణకువతోనే నీ కృప పొందెద ”2”
అందుకే ఈ స్తుతిఘన మహిమల స్తోత్రాంజలి “2” 
                                              “ఆశ్రయ”
నిత్యనివాసినై నీ ముఖము చూచుచు పరవసించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తెజము నాలో కలిగించుచున్నది “2”
స్తుతిఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా “2”
హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ    
                                               “ఆశ్రయ”


          దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment