Tuesday, 3 April 2018

యేసే గొప్ప దేవుడు

యేసే గొప్ప దేవుడు
మన శక్తిమంతుడు
యేసే ప్రేమపూర్ణుడు
యుగయుగములు స్తుతిపాత్రుడు
*స్తోత్రము మహిమా-జ్ఞానము శక్తి* }
*ఘనతా బలము కలుగును ఆమెన్‌* } "2"
                                            *"యేసే"*
మహా శ్రమలలో - వ్యాధి బాధలలో   }
సహనము చూపి స్థిరముగ నిలిచిన } "2"
యోబు వలెనే జీవించెదను             }
అద్వితీయుడు ఆదిసంభూతుడు }
దీర్ఘశాంతుడు మనప్రభు యేసే } "2"
                                      *"స్తోత్రము"*
ప్రార్ధన శక్తితో - ఆత్మ బలముతో  }
లోకమునకు ప్రభువును చాటిన } "2"
దానియేలు వలె జీవింతును      }
మహోన్నతుడు మన రక్షకుడు    }
ఆశ్రయదుర్గము మనప్రభు యేసే  } "2"
                                   *"స్తోత్రము"*
జీవితమంతా - ప్రభుతో నడచి     }
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన } "2"
హనోకు వలెనే జీవించెదను       }
 అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు    }
 నీతిసూర్యుడు మనప్రభు యేసే   } "2"
                                    *"స్తోత్రము"*
  దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment