Tuesday, 10 April 2018

నా హృదయములో నీ మాటలే


నా హృదయములో నీ మాటలే 
నా కనులకు కాంతి రేఖలు  “2”
కారు చీకటిలో కలువరి కిరణమై 
కఠిన హృదయమును కరిగించినావు
నీ కార్యములు వివరింపతరమా 
నీ ఘనకార్యములు వర్ణింపతరమా  “2”   
                            “నా హృదయములో"
మనసులో నెమ్మదిని కలిగించుటకు 
మంచు వలే కృపను కురిపించితివి  “2”
విచారములు కొట్టివేసి 
విజయనదముతో నింపినావు 
నీరు పారేటి తోటగా చేసి 
సత్తువగల భూమిగా మార్చినావు
                            “నా హృదయములో"
విరజిమ్మే  ఉదయ కాంతిలో 
నిరీక్షణ దైర్యమును కలిగించి  “2”
అగ్ని శోదనలు జయించుటకు 
మహిమందముతో నింపినావు
ఆర్ప జాలని జ్వాలగా చేసి 
దీప స్థంభముపై నను నిలిపినావు 
                           “నా హృదయములో"
పవిత్రురాలైన కన్యకగా 
పరిశుద్ధ జీవితము చేయుటకు  “2”             
పావన రక్తముతో కడిగి 
పరమందముతో నింపినావు
సిద్దపడుచున్న వధువుగా చేసి 
సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు 
                          “నా హృదయములో"


           దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment