Thursday, 5 April 2018

రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడో


రారాజు వస్తున్నాడో జనులారా 
రాజ్యం తెస్తున్నాడో ----
త్వరపడి వేగమే రండి ప్రియులరా 
ప్రభుని చేరగా రండి 2
వస్తానన్న యేసురాజు రాకమానునా 
తెస్తానన్న బహుమానం తేకమానునా 2
పాపానికీ జీతం రెండవ మరణం
అది అగ్నిగుండము అందులోని వేదన    
మహిమకు యేసే  మార్గము జీవము  2      
అందుకే నమ్ముకో యేసయ్యను 
పొందుకో నీ పాప పరిహరమూ  2
                               రారాజు”
పాపం చెయ్యదు మహాశాపమయ్యే
ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు 
యేసయ్య గాయాలు స్వస్తతకు కారణం
యేసయ్య గాయాలు రక్షణకు మార్గము  2
                               “అందుకే”
కను రెప్ప పాటున కడబూర మ్రోగగా 
పరమున ఉందురూ నమ్మిన వారందరూ
నమ్మని వారందరూ శ్రమల పాలౌతారు“అందుకే’

 దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment