Monday, 2 April 2018
ఎందుకో నన్నింతగా ప్రేమించినావయ్యా
*ఎందుకో నన్నింతగా ప్రేమించినావయ్యా..* }
*ఏమిటో నాపైనా ఇంత అనురాగమా...* } "2"
*ఏమని వర్ణించను.....* }
*ఊహలకందని నీ ప్రేమను..* } "2"
*వర్ణించనా...ధ్యానించనా...* }
*నా బ్రతుకు అర్పించి ఆరాధించనా..*} "2"
*"ఎందుకో"*
పాపిని అపరాధిని }
అయినను నన్ను ప్రేమించినావు } "2"
ప్రాణమునిచ్చిన ప్రాణదాతవు.....ఆ...ఆ...ఆ..."2"
ఎందుకో ఇంతగా నీ కరుణ. "2"
*"ఎందుకో"*
ఇప్పటి వరకు బ్రతికేది కాదు }
నీ కృపయే నన్ను బ్రతికించెను } "2"
మారనిదీ నన్ను యెడబాయనిది...ఆ...ఆ...ఆ.."2"
నీ కృపలో నన్ను కాపాడినావు "2"
*"ఎందుకో"*
అల్పుడనయ్యా ఈ లోకమందు }
అధికుడవై నన్ను చూసినావు } "2"
కాదనకా ప్రేమించినావు...ఆ...ఆ...ఆ..."2"
కడదాక నాతోనే ఉంటానన్నావు "2*
*"ఎందుకో"*
🎼✍రచన&స్వరకల్పన✍🎼
*బ్రదర్.ఆదాంబెన్నీ గారు*
నర్సంపేట వరంగల్
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏 *Prise TheLord* 🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment