సిలువలో
ఆ సిలువలో ఆ ఘోర
కల్వరిలో
తులువలా
మద్యలో వ్రేలాడిన
యేసయ్యా
వెలియైన యేసయ్యా.. బలియైన
యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా
“సిలువలో”
నేరము చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు
కొరాడాలు ఛెళ్ళున చీల్చెనే నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువునే రుధిరంపు ధారలే
“వెలియైన”
వధకు సిధ్ధమైన గొర్రెపిల్ల వోలే
మోమున ఉమ్మి వేయ మౌనివైనావే
దూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా
“వెలియైన”
నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసే
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించే
నీవికార్చిన రక్తధారలే నా రక్షణకాధారం
సిలువను చేరెదను విరిగిన హృదయముతోను
“వెలియైన”
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment