Tuesday, 10 April 2018

సృష్టికర్తవైన యెహోవా


సృష్టికర్తవైన యెహోవా 
నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు 
మహిమలో స్థానమిచ్చినావు
నాలో నిన్ను చూశావు నీలో నన్ను దాచావు
నిస్వార్ధమైనది నీ ప్రేమా 
మరణము కంటే బలమైనది నీ ప్రేమా  
                                     “సృష్టికర్తవైన”
ఏ కాంతి లేని నిశిద్దిలో 
ఈతోడు లేని విషాదపు వీధులలో
ఎన్నో అపాయపు అంచులలో 
నన్నాదుకున్న నా కన్నతండ్రివి       “ఏ కాంతి”
యేసయ్యా నన్ను అనాధగా విడువక 
నీ లాంజనములతోనాకు పునాదులు వేసితివి “2”  
                                               “సృష్టికర్తవైన”     
నిస్సారమైన నా జీవితములో 
నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేది౦చగా
నశించిపోతున్న నన్ను వెదకివచ్చి 
నన్నాదర్శించిన ప్రేమమూర్తివి        “నిస్సారమైన”
యేసయ్యా నన్ను కృపతో బలపరచి 
ఉల్లాస వస్త్రములనునాకు ధరింపచేసితివి “2”     
                                                “సృష్టికర్తవైన”      


          దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment