Monday, 2 April 2018
ఎంత గొప్పవాడివైన చివరికి బూడిదేగ
*నిన్ను నీవు మరచి తెలుసుకోర మనిషి*
*ఆ....ఆ....ఆ....ఆ....ఆ......*
*ఎంత గొప్పవాడివైన చివరికి బూడిదేగ* }
*ఎంత గొప్ప పేరు ఉన్న చివరి పేరు శవమేగా* }"2"
*ఏ కులమైనా ఏ మతమైనా*
*ఏ రంగైనా ఏ జాతైనా*
*చనిపోతాము అందరూ* }
*చివరికి మిగిలేదెవ్వరు* } "2"
*నిన్నువీవు మరచి తెలుసుకోర మనిషి* "2"
కడుపులో పెట్టి పెంచుకున్న నీ తల్లి }
కనులలో పెట్టి చూసుకునే నీ తండ్రి } "2"
ప్రేమను చూపుతారుర ప్రాణం పెట్టలేరుర "2"
నీకై ప్రాణం పెట్టినవాడు యేసయ్య రా..
నా యేసయ్య రా...
*"నిన్నునీవు"*
ఎప్పుడు చనిపోతామో తెలియదురా }
చివరికి చావే తోడని తెలుసుకోరా } "2"
మరణం రుచి చూడక బ్రతికుండే నరుడెవ్వడు "2"
ఉన్నపాటునే యేసయ్యను సేవించరా..
యేసును ప్రేమించరా...
*"నిన్నునీవు"*
అంతలో కనబడి అంతలో మాయం ఈ జీవం }
నీటిబుడగను పోలియున్నది ఈ ప్రాణం } "2"
రేపు ఏమిజరుగునో ఎవ్వరికీ తెలుసురా "2"
ఈ రోజే నీ హృదయములో చోటివ్వరా
యేసుకు చోటివ్వరా...
*"నిన్నునీవు"*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment