Monday, 2 April 2018

గుండెచెదరిన వారిని ఆదరించె దేవుడా

*గుండెచెదరిన వారిని ఆదరించే దేవుడా* } *గూడుచెదరిన పక్షుల చేరదీసె నాధుడా* }"2" *త్యాగశీలుడా నీ కోందనాలయ్యా* "2" *నా హృదయపాలక స్తోత్రమేసయ్యా* "2" లోకమను అరణ్యయాత్ర భారమాయెను బహు దూరమాయెను నాగుండె నిండ వేదనలే నిండియుండెను  నిందించుచుండెను కన్నీరే నాకు అన్నపానమాయెను " 2 " దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను  బహు ఘోరమాయెను    *"గుండెచెదరిన"* మనిషి మనిషి ఓర్వలేని మాయలోకము శూన్యఛాయలోకము మాటలతో గాయపరచు క్రూరలోకము అంధకార లోకము ఒంటరితనమే నాకు స్నేహమాయెను" 2 " దిక్కులేక నా బ్రతుకుదీనమాయెను బహు ఘోరమాయెను    *"గుండెచెదరిన"* కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి నన్ను అలముకున్నవి కన్నీరు కెరటమై యదలో పొంగుచున్నది పొరలి సంద్రమైనది శ్రమల కొలిమిలో పుటము వేయబడితిని" 2 " పానార్పణముగ నేను పోయబడితిని సిలువ సాక్షినైతిని.        *"గుండెచెదరిన"* 🎹🎼రచన:స్వరకల్పన🎼🎹 *పాస్టర్.శ్రీశైలం గారు* దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment