Tuesday, 3 April 2018
పరాక్రమ శాలివి నీవని
పరాక్రమశాలివి నీవని
మహోన్నత శైలి నీదని
సమున్నత స్థానమే నీదని
సనాతన జీవమే నీవని " 2 "
విజయాల వేదిక నీవని నిను వెదకు వారికి
తరగని నిధి నీవని నిను అడుగు వారికి
*ఆర్భాటించుచు ఆరాదించెద* *ఆనందోత్సాహముతో*
*నాస్తుతి కీర్తన నీకై పాడి*
*నిను ఘనపరచెదను " 2 "*
కదిలించు కధనము నీది
మరిపించు వదనము నీది
నాయెడల చూపినావే అధనముగా నీకృప"2"
పర్వతములు తొలగిపోవుచు
పరిస్థితులనే మార్చిన " 2 "
విడువని నీకృపలో నను దాచినావే " 2 "
*" ఆర్భాటించుచు "*
శత్రువులు తరుముచుండగా
మిత్రులే మరుగౌచుండగా
తలదాచుకున్న నీలో ఆశ్రయము నీవని "2"
నిరాశల నిశీధిలో నడువలేక నిలిచిన వేళ"2"
మేఘస్తంభముగా నడిపించినావే " 2 "
*" ఆర్భాటించుచు "*
నీయందు నివశించాలని
శ్రమలందు వికశించాలని
దిగివచ్చినావు నీవే అరుణోదయ దర్శనమై"2"
ఆంక్షలే లేని ప్రేమతో
అభ్యుదయ భావాలతో " 2 "
గెలిచావు నన్నే నీకై వశముగా " 2 "
*" ఆర్భాటించుచు "*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment