Monday, 2 April 2018
నిజమైన ద్రాక్షావల్లి నీవేనయ్యా...నీలోన నిలిచే తీగను నేనేనయ్యా
*నిజమైన ద్రాక్షావల్లి నీవేనయ్యా* }
*నీలోన నిలిచే తీగను నేనేనయ్యా* } "2"
*నా కోసం దిగివచ్చావా నా యేసయ్యా* "2"
*నన్నువెదికి రక్షిచావా నా మెస్సయ్యా* "2"
*నా యేసయ్యా నీకు వందనమయ్యా* "2"
*నీకు వందనమయ్యా....*
*"నిజమైన"*
ఎత్తైన కొండపైన సత్తువగల భూమిలో }
రాళ్లన్నీ ఏరించావు నన్నునీవు నాటించావు } "2"
నీరుకట్టావయ్యా నన్ను కాచావయ్యా "2"
నీదుతోటలోనను బ్రతీకించుచున్నావయ్యా "2"
*"నాయేసయ్యా"*
శరీర క్రియలన్నీ ఆత్మద్వారా చంపివేసి }
నీలోన జీవంపొంది సాక్షిగ ఉండెదనయ్యా } "2"
జీవా ఊటవు నీవే జీవజల నదివి నీవే "2"
నాలోన పారుమయ్యా వర్ధిల్లజేయుమయ్యా "2"
*"నా యేసయ్యా"*
సంఘమనే వనములోన నన్ను నాటావయ్యా }
నీ ద్రాక్షవల్లితో నను అంటుకట్టావయ్యా } "2"
అభివృద్ధి చేసావయ్యా విస్తరింపజేశావయ్యా "2"
ఉన్నత స్థలములో నను దీవించుచున్నావయ్యా "2"
*"నా యేసయ్యా"*
🎼✍రచన&స్వరకల్పన✍🎼
*బ్రదర్.ఆదాంబెన్నీ గారు*
నర్సంపేట వరంగల్
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment