Monday, 2 April 2018
శిరము మీద ముళ్ల సాక్షిగా
*శిరము మీద ముళ్ల సాక్షిగా*
*కార్చిన కన్నీళ్ళ సాక్షిగా " 2 "*
*పొందిన గాయాల సాక్షిగా*
*చిందిన రుధిరంబు సాక్షిగా " 2 "*
*యేసు నిన్ను పిలచుచున్నాడు*
*నీ కొరకే నిలచియున్నాడు " 3 "*
సర్వపాప పరిహారం కోసం
రక్త ప్రోక్షణం అవశ్యమని " 2 "
మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని
పరమాత్ముడే బలియై తిరిగిలేవాలని
ఆర్య ఋషులు పలికిన ఆ....వేద సత్యం
యేసులోనే నెరవేరెనుగా
*సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ మవశ్యం*
*తద్ రక్తం పరమాత్మేనాం*
*పుణ్యదాన బలియాగం*
ఆర్య ఋషులు పలికిన ఆ....వేద సత్యం
క్రీస్తులో........నే నెరవేరెనుగా
యేసే బలియైన పరమాత్మ *" శిరము "*
మహా దేవుడే ఇలకేతెంచి
యజ్ఞ పశువుగా వధ పొందాలని " 2 "
కాళ్ళలోన చేతులలో 3 మేకులుండాలని
శిరముపైన 7 ముళ్ళ గాయాలు పొందాలని
బ్రహ్మణాలు పలికిన ఆ.....వేద సత్యం
క్రీస్తులో.......నే నెరవేరెనుగా
*చత్వారి శ్రుగ్నత్రయో అస్యపాద ద్యే*
*శీర్షే సప్త హస్తాసో !*
*అస్య త్రిధా బద్ధో వృషభో రోరవీతి*
*మహో దేవో మర్త్యాం ఆవివేశ ఇథి!!*
బ్రహ్మణాలు పలికిన దేవోక్తి
యేసులో......నే నెరవేరెనుగా
యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడు
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment