Monday, 2 April 2018
నమ్ము నేస్తమా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం
*నమ్ము నేస్తమా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం*
*నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు - నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు*
అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు "2"
నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను విడచిపెట్టిపోడు
కంటిపాపలా తోడుండి నిను కాచుకుంటాడు కన్నతండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు
*"నమ్ము"*
కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు
దున్నబడకపోతే - భూమి పంట ఇవ్వలేదు చెక్కబడక పోతే - శిల శిల్పం కాదు
శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు
*"నమ్ము"*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment